Bhagavat Gita
11.1
అర్జున ఉవాచ:
{11.1}
మదనుగ్రహాయ పరమం గుహ్య మధ్యాత్మ సంజ్ఞితం
యత్త్వయోక్తం వచస్తేన మోహో అయం విగుతోమమ
కృష్ణా! నన్ను అనుగ్రహించుటకై నీవు చేసిన ఉత్తమము, రహస్యము, ఆత్మవిద్యా రూపమైన ఉపదేశము వలన నా మోహము పోయినది
భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా
{11.2}
తత్త్వః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్
కమల దళ లోచనా! ప్రాణుల యొక్క ఉత్పత్తి నాశములు నీ వలన ఆలకించితిని. అవ్యయమైన నీ మహాత్మ్యమును గూడా వింటిని
ఏవమేత ద్యథా ఆత్థ త్వ మాత్మానాం పరమేశ్వర !
{11.3}
ద్రష్టుమిచ్చామి తే రూప మైశ్వరం పురుషోత్తమ !
పరమేశ్వరా! నిన్ను గురించి నీవు చెప్పిన దంతయు సత్యమే అని నమ్ముచున్నాను. పురుషోత్తమా! నీ యొక్క ఈశ్వర సంబంధమైన విశ్వరూపమును నేనిపుడు చూడదలచుచున్నాను
మన్యసే యది తచ్ఛక్య౦ మయా ద్రష్టు మితి ప్రభో
{11.4}
యోగేశ్వర! తతోమే త్వం దర్శయాత్మాన మవ్యయమ్
ప్రభూ! నీ స్వరూపమును దర్శించుట నాకు సాధ్యమగునని నీవు భావింతువేని, యోగేశ్వరా! అవ్యయమైన నీ విశ్వరూపమును నాకు జూపుము
శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యులలో ముఖ్యుడైన స్వామీ వివేకానంద "మతం దేవుని గూర్చి తెలిసికొనుటకు; ఇంకేదీ మనలని సంతృప్తి పరచదు" అనేవారు. ఆయన యువకుడుగా ఉన్నప్పుడు, అనేక సంశయాలతో కూడి ఉండేవారు. నేటి యువతలాగ, ఆయన జీవితానికి అర్థమేమిటి అని ఆలోచించేవారు. ఆయనకు సాహిత్య, తత్త్వ పుస్తకాలు ఎన్ని చదివినా తృప్తి రాలేదు. అప్పుడు ఆ నాటి ఆధ్యాత్మిక గురువులను కలిసి "మీరు దేవుని చూసారా?" అని అడిగేవారు. ప్రతి ఒక్కరూ లేదనే సమాధానమిచ్చేవారు.
చివరకు ఆయన శ్రీ రామకృష్ణను కలిసి అదే ప్రశ్న వేసేరు. ఆయన నవ్వుతూ "నేను దేవుని నీకన్నా స్పష్టంగా చూస్తాను. నిన్ను నా కళ్ళతోనే చూస్తాను. కాని దేవుని నా ప్రతి అణువుతోనూ చూస్తాను" అని సమాధానమిచ్చేరు.
స్వీయానుభవం లేకపోతే ఎవ్వరూ తాము దేవుని చూసామని చెప్పలేరు. శ్రీ రామకృష్ణ వలె దేవుని దూత వంటివారు చూడడానికి సాధారణంగా కనిపించినా, లోపల వేరే, శకలం వలె బ్రతికే జీవివలె కాక, దేవునివలె ప్రేమి౦చే శక్తి కలిగి ఉంటారు.
కొన్నేళ్ళ సాధనతో దేవుడు ఎంతో కొంత మనకు అగుబడతాడు. అప్పుడు మనం జీవితపు లోతులను చూస్తాం. ఆ అనుభవం కొన్ని క్షణాలు ఉండవచ్చు. కాని అది దేవుని ఉనికి గూర్చి మరపురాని అనుభవం. అప్పటి నుంచి మనం మనుష్యులు ఎటువంటి రంగువారైనా, పొట్టివారైనా, పొడుగువారైనా, వారిలో దేవుని చూస్తాం. మనం అలా ఒకమారు రుచి చూస్తే ఇంకా వేరేదేమీ దాని సాటి రాదు. మన కోర్కెలన్నీ ఆ అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలనే దిశగా లీనమవుతాయి.
మనకి ఈ విధంగా జ్ఞానోదయం అయితే, దేవుని గేల౦లో చిక్కుకుంటాం. ఎక్ హార్ట్ మనమెంత అల్లాడితే, ఆ గేల౦లో అంత చిక్కుకుంటాం అన్నారు. మనము తప్పించుకోవడానికి ప్రయత్నించవచ్చు; చివరికి మనకు గేల౦ వేసినవారు ఎవ్వరో తెలిసికొంటే, మనలను ఆ సాక్షాత్తూ పరమాత్మ పట్టుకున్నాడని గుర్తించి మనమెంతో అదృష్టవంతులమని భావిస్తాము.