Bhagavat Gita
10.4
ఏతాం విభూతి౦ యోగం చ మమ యో వేత్తి తత్త్వతః
{10.7}
సో అవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః
నా ఈ విభూతి యోగమును ఎవడు వాస్తవముగ తెలిసి కొనుచున్నాడో అతడు నిశ్చలముగ యోగముతో కూడి యుండును. ఈ విషయమున సందేహము లేదు
అహం సర్వస్య ప్రభవో మత్తస్సర్వం ప్రవర్తతే
{10.8}
ఇతి మత్వా భజ౦తే మాం బుధా భావసమన్వితాః
ఈ జగత్తంతయు నా వలననే జనించిన దనియు, నా వలననే ప్రవర్తించు చున్న దనియు గ్రహించిన జ్ఞానులు నన్నే సేవించుచున్నారు
మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరం
{10.9}
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ
నా యందే మనస్సును, ప్రాణమును లగ్న మొనర్చి, నన్ను గురించి పరస్పరము ముచ్చటించుకొనుచు, నా కథలను చెప్పుకొను భక్తులు సదా తృప్తిని, ఆనందమును పొందుచున్నారు ఀ
భగవంతుని ప్రాణదా -- అనగా ప్రాణాన్ని ఇచ్చిన దాత -- అంటారు. జగత్తులోని అన్ని శక్తులూ ప్రాణం నుంచి ఉద్భవించినవి. ప్రాణము వలన సూర్యుడు వెలుగుచున్నాడు, మేఘాలు వర్షాన్ని కురిపిస్తున్నాయి, గాలి వీచుచున్నది. ప్రాణము వలననె కణములు వృద్ధినొందును, కళ్ళు చూడును, మనస్సు ఆలోచించును, హృదయము ప్రేమించును. భౌతిక శాస్త్రజ్ఞులు చెప్పే పదార్థము, శక్తికి మధ్యగల సంబంధం, జీవులకు, ప్రాణమునకు మధ్య కూడా ఉంది. ఇంకా పదార్థము వెనుకనున్న శక్తి, ప్రాణ శక్తి వలననే సాధ్యము.
ప్రశ్నోపనిషత్తులో "ప్రాణము ఆత్మ నుండి ఉద్భవించినది. ఒక వ్యక్తికి నీడ ఎలాగో, ఆత్మ యొక్క నీడ ప్రాణము" అని చెప్పెను. కావున యోగులు అడిగేది, మనకు ఒకటి చెందుతుందని ఎలా అనగలము? మనమనుకొనే వాహనాలు, ఇళ్ళు, బంగార౦, నిజానికి మనవికాక దేవునికి చెందినవి. ఆది శంకరుల వంటి వారు "ఈ ప్రపంచములో నేను ఏది త్యజించగలను? నాదంటూ ప్రపంచంలో ఏదీ లేదు. అంతా భగవంతునిదే" అని చెప్తారు.
మన మిత్రుడు దగ్గరకు వెళ్ళి "నీ వీణని నేను త్యజిస్తున్నాను" అంటే వాడు "ఏమిటి నువ్వు చెప్పేది? ఆ వీణ నీదికాదు. అది నాది" అని చెప్పును. మనది కాని వస్తువును త్యజించడంలో కష్టం ఎక్కడుంది? ఆధ్యాత్మిక సాధనలో మనదంటూ ఏమీ లేదని, అంతా పరమాత్మ స్వంతమని తెలుసుకొంటాము.
ఇలా మన౦ హృదయపూర్వకంగా నమ్మితే మానసిక ఒత్తిడి తగ్గి దేహానికి మేలు కలుగుతుంది. మనది కాని వస్తువును కాంక్షిస్తే, దాని వలన వొత్తిడి కలిగి, మన ప్రాణ శక్తిని వెచ్చించ వలసి వస్తుంది. అది ఎలాగంటే మన కారు ఇంజిన్ ను ఆపకుండా రాత్రంతా వదిలేస్తే, మరునాడు దానిలో ఇంధనం లేక నడపలేము. ఇక్కడ ప్రాణము ఇంధనము వంటిది. అది లేకపోతే ఏదీ నడువదు.
గాఢమైన ధ్యానంలో, ప్రాణాన్ని స్వాధీనంలో పెట్టుకోగలం. అంటే మన కోరికలను నియంత్రించుకుంటాం. అప్పుడు మన ప్రాణ శక్తిని వృధా కాకుండా చేయగలం. దాని వలన మన నాడి వ్యవస్థ పై ఒత్తిడి తగ్గి మనస్సు తేలిక అవుతుంది. చివరగా లైంగిక కర్మలను స్వాధీనంలో పెట్టుకొంటే ప్రాణ శక్తి అధికమౌతుంది. ఈ విధంగా యోగులు ప్రాణ శక్తిని స్వాధీనంలో పెట్టుకొంటారు.
ప్రాణ శక్తి మనందరిలో ఉన్న భగవంతుని వైపు ప్రసరిస్తుంది. దీనివలన కలిగే భద్రత చెప్పనలవిగాదు. స్వానుభవంతో మనలో ఉన్న భగవంతుని శక్తి అపరిమితమని మనకు తెలుసు. కాబట్టి మనము ప్రేమించడానికి లేదా సేవ చేయడానికి పరిమితులు లేవు. దానిని పూర్ణత అందురు. అంటే దానిలో ఎట్టి లోటూ లేదు. అది సంపూర్ణమైనది. ఇలాగ మనది కాని వస్తువుని త్యజిస్తే మనము పూర్ణులమవుతాము. తద్వారా మన గాఢమైన కోరికలు తీరుతాయి.