Bhagavat Gita
10.6
అర్జున ఉవాచ :
{10.12}
పరం బ్రహ్మ పరం ధామ పరమం భవాన్
పురుషం శాశ్వతం దివ్య మాదిదేవ మజం విభుమ్
ఆహుస్త్వా మృషయ స్సర్వే దేవర్షి ర్నారద స్తథా
{10.13}
ఆశీతో దేవలో వ్యాస స్స్వయం చైవ బ్రవీషిమే
నీవు పరబ్రహ్మవు. పరంధాముడవు. పరమ పావనుడవు. శాశ్వతుడవు. దివ్యమైన వాడవు. ఆదిదేవుడవు. అజుడవు. ప్రభువువని ఋషులు, దేవర్షియైన నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు తెలిపియే యుండిరి. నీవును అట్లే చెప్పుచుంటివి
అర్జునుడు సర్వ మతాల సమైక్యతను గురించి చెప్పక చెప్పుచున్నాడు. ఆధ్యాత్మిక గురువులు ఒకే వాస్తవికత గురించి చెప్పి, మనను ఒక ఉన్నత లక్ష్యానికి చేరమని ప్రోత్సహించుచున్నారు. వారందరూ మనలోని దైవత్వమును గురించి చెప్పియు౦డిరి. కాని మనకు అది సమ్మతము కాదు. నాకు బోధపడనిది: కొందరు మానవాళి విధ్వంసమును వివరించు పుస్తకములు చదువుతారు; ఇంకొందరు మానవాళి చేసే చెడ్డ పనుల వార్తలను వార పత్రికల్లో చదవడానికి ఎగబడతారు; మరికొందరు బలహీనతనులను ఆసరాగా చేసికొని ఇతరులకు కష్టం కలిగిస్తారు. కాబట్టి జీసస్ "స్వర్గము మనలోనే ఉంది" అంటే వారికి నమ్మశక్యం కాదు. మనలోని ఆత్మ శుద్ధమై, శాశ్వతమై ఉన్నది. కాబట్టి యోగులు, ఋషులు మన ఆనంద౦, భద్రత మనలోనే ఉందని చెప్తారు.