Bhagavat Gita
10.8
వక్తుమర్హ స్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః
{10.16}
యాభి ర్విభూతిభిర్లోకా నిమా౦ స్త్వ౦ వ్యాప్య తిష్ఠసి
ఏ విభూతుల చేత నీవు ఈ లోకముల నన్నిటిని వ్యాపించి యున్నావో అట్టి దివ్యములగు నీ విభూతులను చెప్పుటకు నీవే తగుదువు
కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్
{10.17}
కేషు కేషు చ భావేషు చింత్యో అసి భగవన్ మయా
యోగేశ్వరా! నిన్ను తెలిసికొనుటకు సదా ఏ విధముగ నేను ధ్యానింపవలెను? ఓ భగవంతా! ఏ ఏ భావములచే నిన్ను ధ్యానింపవలెను?
విస్తరేణాత్మనో యోగం విభూతి౦ చ జనార్దన
{10.18}
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే అమృతమ్
జనార్దనా! నీ యొక్క యోగ మహిమను, విభూతులను మఱల సవిస్తరముగ చెప్పుము. నీ జ్ఞానామృతమును గ్రోలుచున్న నాకు తనివి తీరకున్నది
అర్జునుడు దేవుని సదా -- అంటే అన్ని క్రియాలలోనూ, అందరిలోనూ--ఎరుగుట ఎట్లు అని అడుగుచున్నాడు. ధ్యానంలో సెయింట్ ఫ్రాన్సిస్ చెప్పిన "ఇచ్చుటవలననే తిరిగి పుచ్చుకుంటాం; ఇతరులను క్షమించడంవలన మనం క్షమించ బడతాం" అనే వాక్యాలను స్మరించు కోవచ్చు. క్షమించడం మరియు దానం చెయ్యడం దేవుని లక్షణాలు. కానీ ఇలా రోజూ ఒక గంటో, రెండు గంటలో ధ్యానం చేయడం సరిపోదు. మనము సదా దేవుని స్మరించు కోవాలి. అంటే మన ఆలోచనలలోనూ, క్రియలలోనూ దేవుని స్మరించాలి. అలాగే ఇతరులలోని దైవత్వాన్ని చూడాలి. మనకు అది ఎలాగో తెలియకపోతే, ఇతరులలోని దైవత్వాన్ని తెలిసికోవడానికి ప్రయత్నించాలి. ఆచరణలో మనం దీన్ని పదే పదే గుర్తు చేసుకోవాలి. ఇదే మనము మంత్రజపములో చేసేది.
మనస్సుకి సహజంగా వస్తువులపై ఏకాగ్రతతో ఉండే సామర్థ్యం ఉంది. మంత్ర జపం ద్వారా మన మనస్సు యొక్క ఏకాగ్రత దేవుని మీద ఉంచుతాం. సామర్థ్యం లేదా ఏకాగ్రత ఒక్కటే కానీ దాని లక్ష్యం వేరు. హసిడిక్ యూదులు చెప్పుకొనే కథ ఒకటుంది. ఒక యూదుడు తన గురువును "మనము దేవుని వ్యాపారంలో ఇచ్చి-పుచ్చు కోవడాల్లో కూడా గుర్తుపెట్టుకోవాలా?" అని అడిగేడు. గురువు "అవును. మనం ధ్యానంలో వ్యాపారం గూర్చి ఆలోచిస్తున్నప్పుడు, భగవంతుని గూర్చి వ్యాపారంలో ఆలోచించవద్దా" అని సమాధానమిచ్చేడు.
మన మనస్సు దేవుని యందు స్థిరమైనప్పుడు, అతని వైభవము అంతటా చూస్తాము. ముఖ్యంగా అందము, శ్రేష్ఠత ఉన్న చోట్లలో. నేను నా అమ్మమ్మ దయవలన జీవితాన్ని ఇలాగే చూస్తాను. నేను పచ్చని గడ్డి మొలవడం, నా పెంపుడు కుక్క మూకా సముద్రపుటొడ్డున పరిగెత్తడం, ఒక తల్లి ఓర్పుతో తన బిడ్డను ఓదార్చడం చూసినప్పుడల్లా దేవుడు గుర్తుకొస్తాడు. మనమిలా చూడడం మొదలు పెడితే మంత్ర౦ యొక్క సహాయం అక్కరలేదు. దేవుడే ప్రపంచంలోని ప్రతీ దాన్నీ తన శక్తితో నడుపుతున్నాడు అన్న విషయం ఎప్పటికీ మరచిపోలేం.