Bhagavat Gita
11.10
త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం విధానం
{11.18}
త్వమవ్యయ శ్శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వ౦ పురుషో మతో మే
నీవు అక్షరస్వరూపుడవు. పరమాత్మవు. తెలియదగినవాడవు. ఈ విశ్వమునకు పరమాశ్రయుడవు. శాశ్వత ధర్మ రక్షకుడవు. అవ్యయుడవు. సనాతనుడైన పురుషుడవు అని నా అభిప్రాయము
అనాదిమధ్యా౦త మనంతవీర్య మనంతబాహుం శశిసూర్యనేత్రం
{11.19}
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తప౦తమ్
ఆది మధ్యా౦త రహితువినిగను, అనంత వీర్యవంతుని గను, అనేక హస్తములు గలవానినిగను, చంద్ర సూర్యులు నేత్రములుగ గలవానినిగను, ప్రజ్వలించు అగ్నివంటి ముఖము గలవానినిగను, స్వప్రకాశముచే విశ్వమంతటిని దీప్తిమ౦తము చేయువానినిగను నిన్ను గాంచుచున్నాను
ద్యావాపృథివ్యో రిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః
{11.20}
దృష్ట్వా అద్భుతం రూపముగ్ర౦ తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్
మహాత్మా! భూమ్యాకాశముల మధ్య ప్రదేశమును, దిక్కులన్నియు నీ చేతనే పరివ్యాప్తమై యున్నవి. అద్భుతమైనట్టి, భయంకరమైనట్టి, నీ రూపమును జూచి ముల్లోకములు మిగుల భీతిని చెంది యున్నవి
అమీ హి త్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి
{11.21}
స్వస్తీత్యుక్త్వా మహర్షి సిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః
దేవతా సమూహములన్నియు నీలో ప్రవేశించుచున్నవి. కొందరు సిద్ధుల సమూహములు "స్వస్తి" పలుకుచూ అనేక స్తుతులచే నిన్ను ప్రార్థించుచున్నారు ఀ
అర్జునడు శ్రీకృష్ణుని అనంతమైన విశ్వ రూపం చూసి తాను విభ్రాంతుడైనాడని మళ్ళీ మళ్ళీ చెపుతున్నాడు. శాస్త్రజ్ఞులు దేవుని శక్తిని సంశయంతో చూస్తారు. ఎందుకంటే యోగులు చెప్పే దేవుడు ఎవరో వారికి తెలియదు కనుక. మనలో చాలామంది దేవుడు మనకన్నా వేరుగా ఉన్నాడని తలుస్తారు. వాళ్ళకి మనలోని ఆత్మే దేవుడని ఎంత చెప్పినా నమ్మరు. సూఫీలు అంతరిక్షంలో ఇమడలేని దేవుడు మన హృదయాల్లో ఇమిడి ఉన్నాడని చెప్పుదురు.
ఈ విధంగా ఒక యోగి దృష్టి, శాస్త్రజ్ఞుని దృష్టి మధ్య ఎటువంటి తేడా లేదు. అబ్బే జార్జెస్ లెమైటెర్ అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు విశ్వమంతా మొదట్లో ఒక గ్రుడ్డు రూపంలో, దేశకాలాలు లేక, అసంఖ్యాకమైన సాంద్రతతో ఉండేదని చెప్పెను. ఇది ఎలాగంటే ఒక న్యూట్రాన్ నక్షత్రం ఎంతో సాంద్రత కలిగి విస్పోటనము చెంది దేశకాలాలు లేని ఒక కృష్ణ బిలంగా మారినట్టు. మన స్మృతులలో దీనినే హిరణ్యగర్భ లేదా బ్రహ్మాండం అంటారు. లెమైటెర్ విస్పోటనము చెందిన గ్రుడ్డు విశ్వంగా వృద్ధి చెంది సర్వవ్యాప్త మైనదని చెప్పెను.
మనం అడిగే ప్రశ్న "విశ్వం నిక్షిప్తమైన గ్రుడ్డులో ఎందుకు విస్పోటనము జరిగినది?" ఒక శాస్త్రజ్ఞుడు బయటనుంచి ఏదో దానిని బలంగా కొట్టిందని భావిస్తాడు. యోగి భగవంతుడు ఒక ఉదజని అణువులో, సూర్యుని కేంద్రంలో, ఒక చెట్టుగా మొలకెత్తే బీజంలో ఉన్నట్టే ఆ గ్రుడ్డులో కూడా ఉన్నాడని భావిస్తాడు. నేను జీవ శాస్త్రజ్ఞుడను కాకపోయినా, దేవుని శక్తి ఒక బీజంలో ఉందని నమ్ముతాను. ఆ శక్తి ఒక చెట్టును ఎక్కడ నుంచో కాక, ఆ బీజం నుంచి ఉద్భవి౦పచేస్తుంది. ఆ చెట్టు ప్రతి కొమ్మలోనూ, ఆకులోనూ దేవుని శక్తి ఉంది. అందువలనే ఆకులు సూర్యరశ్మితో ఆహారం తయారు చేస్తాయి; కొమ్మల్లో రసం ప్రవహిస్తుంది.
గాంధీ దేవుడు ధర్మమని చెప్పెను. అంటే ధర్మకర్త్రి -- సిద్ధాంతాలను చేసేవాడు. బుద్ధుడు ఒక మారని సిద్ధాంతం విశ్వ౦లో అంతర్లీనమై ఉన్నదని చెప్పెను. ఇది మనలో చాలామందికి సమ్మతము. కానీ ధర్మకర్త్రి విషయం కొస్తే మనకు అపనమ్మకం ఉండవచ్చు. శ్రీ రామకృష్ణ దేవుడు వ్యక్తిగతము, నిరాకారము అని భావించెను. సిద్ధాంతము, దాని కర్త ఒకే దేవుని నుండి ఆవిర్భవించేయి. అన్ని సిద్ధాంతాలు జీవైకమత్యం కొరకే వచ్చేయి. భౌతిక, రసాయన శాస్త్రాల సిద్ధాంతాలు ఆ జీవైకమత్యం యొక్క వివిధ అంశాలు. అలాగే ఆధ్యాత్మిక సిద్ధాంతాలు భౌతిక లేదా రసాయన శాస్త్ర సిద్ధాంతాలు జీవైకమత్యం గురించే ఉన్నాయి.
కాబట్టి విశ్వం ఒక్కటే. వివిధ సిద్ధాంతాలు ఒకదాని కొకటి సంబంధంలేక కలగూర గంపగా లేవు. అలా ఉంటే సృష్టి అంతా గందరగోళంగా ఉంటుంది. జీవైకమత్యం లేకపోతే ఒక పద్దతి లేక, మనకు దేనికై ఎదురుచూడాలో తెలియదు. ఉదాహరణకి ఒక వంకాయ విత్తనం నాటితే, గోంగూర చెట్టు మొలవదు; ఒక బంతిని మీదకి విసిరితే అది అంతరిక్షంలోకి పోదు. ఉనికి కలిగిన అన్ని విషయాలలోనూ, సిద్ధాంతాలు ఉన్నాయి. గురుత్వాకర్షణ గూర్చి సిద్ధాంతం, ఒక ఆధ్యాత్మిక సిద్ధాంతం ఒకే యోనిలో౦చి వచ్చేయి. ఐన్స్టీన్ పదార్థమును, శక్తిని అనుసంధానము చేసిన తరువాత, వాటిని ఆ విధంగా సృష్టించిన సిద్ధాంతాన్ని కనుగొనుటకు చాలా ప్రయత్నించి విఫలుడైనారు. "ఏది తెలుసుకొంటే అన్ని విషయాలు అవగతం అవుతాయి?" అనే దృక్పథంతో మన స్మృతులు అన్వేషించాయి. సమాధి స్థితిలో దీని సమాధానం మనకు దొరుకుతుంది. అలాగే అన్ని సిద్ధాంతాలను సృష్టి చేసిన ధర్మకర్త్రిని పట్టుకొంటాం.