Bhagavat Gita
11.11
రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా విశ్వే అశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ
{11.22}
గంధర్వయక్షా మరసిద్ధసంఘాః వీక్ష౦తే త్వాం విస్మితా శ్చైవ సర్వే
రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినీ దేవతలు, వాయుదేవతలు, పితృదేవతలు, యక్షులు, గంధర్వులు, అసురులు, సిద్ధులు మొదలగు వారందరును ఆశ్చర్యమును బొందినవారై నిన్ను గాంచుచున్నారు
రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహు బహూరుపాదం
{11.23}
బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథిటా స్తథా అహం
కృష్ణా! అనేక ముఖములు, నేత్రములు గలిగినట్టియు, అనేకములగు బాహువులు, ఊరువులు, పాదములు గలిగినట్టియు, అనేక ఉదరములు గలిగినట్టియు, అనేక కోఱలచే భయంకరమైనట్టియు నగు నీ అద్భుత రూపమును జూచి జనులందరును భయపడుచున్నారు. నేనును అలాగే భయపడుచున్నాను
నభఃస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తానన౦ దీప్తవిశాలనేత్రం
{11.24}
దృష్ట్వాహి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతి౦ న విందామ శమంచ విష్ణో
కృష్ణా! నీవు గగనము నంటియున్నావు. ప్రకాశించు అనేక వర్ణములు గలవాడవు. తెరిచిన నోళ్ళు గలవాడవు. ప్రజ్వలించెడి విశాలమైన నేత్రములు గలవాడవు అగు నిన్ను జూచి నా మనస్సు భయపడినది. నేను ధైర్యమును, శాంతిని పొందలేకయున్నాను
దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవకాలానల సన్నిభాని
{11.25}
దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస
కోఱలచేత భయంకరమైన ప్రళయాగ్నిని బోలిన నీ ముఖములను జూచి నేను దిగ్భ్రాంతి చెందియున్నాను. సుఖమును కూడా పొందలేక యున్నాను. దేవదేవా! జగదాశ్రయా! ప్రసన్నుడవగుము ఀ
అర్జునడు శ్రీకృష్ణుని ఒక నియంతగా ఉండి జీవులను చంపే శక్తిగా వర్ణించుచున్నాడు.
పుట్టినవి గిట్టక తప్పదు. ఒక సూక్ష్మ క్రిమి కొన్ని నిమిషాలు బ్రతకవచ్చు. వర్షాకాలంలో వచ్చే చిమటలు కొన్ని గంటలు మాత్రమే బ్రతుకుతాయి. వాటితో పోలిక పెడితే మనము కొన్ని వందల రెట్లు కాలం బ్రతుకుతాం. కానీ మన కన్నా సూర్యుడు కొన్ని కోట్ల రెట్లు కాలం బ్రతుకుతాడు. ఒక మారు ఇంధనం అయిపోతే సూర్యుడు వైట్ డ్వార్ఫ (white dwarf) అనే నక్షత్రంగా మారి తన ప్రకాశాన్ని కోల్పోతాడు. ఇంకా చెప్పాలంటే ఈ విశ్వమే ఒకనాడు అంతరించి పోతుంది.
కానీ నక్షత్రాలు, పుంతలు వలె కాక మనము మరణాన్ని తప్పించుకోవచ్చు. ఇదే మతాలు ప్రతిపాదించేది. మనమంతా మరణం సహజమని భావిస్తాము. కాని కొందరు ఆధ్యాత్మిక గురువులు మరణాన్ని జయించేరు. మహమ్మద్ "మరణించడానికి ముందే మరణించు" అని చెప్పెను. ఒక దొంగ బంగారు నగలు వేసికోనివారను ఏమీ చేయడు. అలాగే మరణం కోరికలను జయించినవారికి రాదు. కొందరు "ఈ పిండివంట తినాలి, ఆ వస్త్రం వేసికోవాలి, వేరే దేశానికి వెళ్ళాలి, ఇటువంటి కార్ కొనాలి" అనే కోర్కెలతో సతమతమవుతూ ఉంటారు. మృత్యు దేవత అటువంటివారిని చూసినప్పుడు "వీడొక ధనవంతుడు. ఎన్నో కోరికలు నేను దొంగలించ వచ్చు" అని అనుకొంటుంది. మనము ధ్యానము ద్వారా స్వార్థపూరిత కోర్కెలను నిర్మూలిస్తే, దేహంతో తాదాత్మ్యం చెందకుండా ఉంటాము. అటు తరువాత మన దేహం పడిపోయినా చేతన మనస్సులో ఎటువంటి చీలిక ఉండదు. దాని బదులు ఎన్నటికీ మరణించని ఆత్మపై అవిచ్ఛిన్నమైన ఎరుక ఉంటుంది.