Bhagavat Gita
11.9
కిరీటినం గదినం చక్రిణం చ
తేజోరాశి౦ సర్వతో దీప్తిమంతం
{11.17}
పశ్యామిత్వాం దుర్నిరీక్ష్యం సమంతా
ద్దీప్తానలార్క ద్యుతి మప్రమేయమ్
కిరీటము, గద, చక్రము గల వానిని గను, అంతటను ప్రకాశించు వానిని గను, తేజోమయుని గను, ప్రజ్వలించెడి అగ్ని సూర్యుల ప్రకాశము గల వానిని గను, అప్రమేయుని గను నిన్ను సకల ప్రదేశములందు గాంచుచున్నాను
తరతరాలుగా సూర్యనమస్కారాలు చేసి మనను క్రియలకై ప్రేరేపించే సూర్యునికి వందనములు సమర్పిస్తున్నాం. ఆయన మరోపేరు దినకరుడు. మనం కాంతిని, ఉష్ణాన్ని, ఆహారాన్ని ఆయనవలననే పొందుతున్నాము. సమస్త జీవులు సూర్యుని మీదే ఆధారపడి ఉన్నాడనడంలో అతిశయోక్తి లేదు.
ఈ మహాద్భుతాన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు ఇలా వివరిస్తారు. 1500 కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. 65.7 కోట్ల మెట్రిక్ టన్నుల ఉదజననిని 65.25 కోట్ల హీలియ౦ గా మార్చి శక్తిని విడుదల చేస్తాడు. ఆ రెండు సంఖ్యల మద్ద తేడా ఆ శక్తి ఘనీభవిస్తే ఉండే బరువు.
జీవితంలో ఏదీ అకారణంగా లేదు. ప్రతీదీ పదార్థము లేదా శక్తి అయ్యి సృష్టి అంతా వ్యాప్తి చెంది ఉన్నది. ముఖ్యంగా మన భూగోళంలో అది సమంగా ఉంది. సూర్యుని కేంద్రంలో ఉండే శక్తి ఉపరితలం మీద కొస్తే మన సౌర కుటుంబంలోని జీవులన్నీ మాడి మసై పోతాయి. సర్ జేమ్స్ జీన్స్ అనే ఆంగ్ల ఖగోళ శాస్త్రజ్ఞుడు ఇలా చెప్పెను: "ఒక గుండు సూది అంత సూర్యుని పదార్థాన్ని మన భూగోళం మీదకి తీసికువస్తే దాని వేడి వలన 100 మైళ్ళ దూరంలో ఉన్న మనిషి కాలిపోతాడు. " సూర్య కిరణాలు మన దేహాలని తాకే ముందు మన వాతావరణాన్ని చొచ్చుకొని రావాలి. అంతకు ముందు సూర్యుని ఉపరితలంలోని అణువులను చొచ్చుకొని రావాలి. ఈ విధంగా సూర్యుని ప్రతాపము తగ్గి మనకి సరైన ఉష్ణోగ్రతతో అందుతుంది.
ఈ విషయాలు ఖగోళ శాస్త్రజ్ఞులను కూడా ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. కానీ ఎక్కడైతే శాస్త్రజ్ఞులు థెర్మోడైనమిక్స్ సిద్ధాంతాలను చూస్తారో , అక్కడ యోగులు దేవుని ప్రేమను, వైభవాన్ని చూస్తారు. విలియం బ్లేక్ అనబడే కవి "నేను నా కళ్ళలోంచి చూస్తాను. అంటే కళ్ళతో కాదు. సూర్యుడు ఉదయిస్తూ ఉంటే నేను ఒక ప్రకాశవంతమైన వృత్తాకారము చూడను. నేను చూసేది పవిత్రమైన అంతరిక్ష దేవతను"
సూర్యునివంటి అద్భుతమునకు భగవంతుని ప్రేమే కారణము. ఆయన ప్రతి అణువులోనూ ఉన్నాడు. పదార్థమును, శక్తిని కలిపి చెప్పే సిద్ధాంతాలు జీవుల ఐకమత్యానికి సూచిక. ఒక నక్షత్రం మాట్లాడగలిగితే అది ఒక పద్యం చదవక, గురుత్వాకర్షణను పొగుడుతుంది. చిన్న వయస్సు గల నక్షత్రాలు కృష్ణ బిలాలతో ప్రేమ బంధానికై అర్రులుచాస్తాయి. వాటికి జీవైకమత్యం శక్తి వలన సాధ్యం; మనకు అదే ప్రేమ వలన సాధ్యం. వివరించే పదాలు వేరైనా, వాటి భావం ఒక్కటే.