Bhagavat Gita
11.13
ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో
నమో అస్తు తే దేవవర! ప్రసీద
{11.31}
విజ్ఞాతు మిచ్చామి భవంత మాద్య౦
న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్
దేవదేవా! నీకు నమస్కారము. ఉగ్రరూపుడగు నీవెవడవు? ఆదిపురుషుడవగు నిన్ను తెలియగోరుచున్నాను. నీ ప్రవర్తనము నాకు బోధపడుట లేదు
అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపం భయంకరంగా ఉందని తలచెను. అతని సంశయము దేవుడు సదా కరుణా మూర్తియని తలచడం వలెన కలిగినది. ఇది జీవిత సత్యం. మనము పుట్టిన దగ్గర నుంచి మరణంవైపే ప్రయాణిస్తున్నాము. ఒక చిన్న సూక్ష్మ క్రిమి నుంచి అతి పెద్దదైన నక్షత్రం వరకూ మరణము సహజము. మన శరీరంలో వేలకొద్దీ కణాలు ప్రతి ఘడియ మరణిస్తున్నాయి. బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్ "జీవితం యొక్క ప్రతి దశలోనూ మరణిస్తున్నాము" అని చెప్పును. మనము మరణాన్ని తప్పించు కోవాలంటే దేహంతో తాదాత్మ్యము చెందే అవిద్యను తొలగించుకోవాలి.
శ్రీరామకృష్ణ జీవితం ఒక ఆసుపత్రి లాంటిది అంటారు. దేవుడు మనం పాటించే వేర్పాటును తొలగించుకొనడానికి, మనని సంపూర్ణులగా చేయడానికి భూమి మీదకు పంపేడు. మనకి హింస, క్రోధం ఎదురైతే, స్థిరంగా, క్షేమంగా ఉండి మన స్థితిని ఉన్నతం చేసికోవాలి. కానీ కొంతమంది తిరగబడతారు. వారు ఆసుపత్రికి వెళ్ళవలసి వస్తుంది. మనం ఈ విధంగా అనుభవించిన తరువాత, తిరుగుబాటు దుఃఖానికి దారి తీస్తుందని తెలిసికొ౦టాము.
బుద్ధుడు 4 సూత్రాలు చెప్పేడు.
- మొదటిది: మనమందరమూ వ్యాధిగ్రస్తులం.
- రెండవది: వ్యాధికి కారణం మన కోరికలు, బంధాలు. అది ప్రపంచంలోని అందరికీ వర్తిస్తుంది
- మూడవది: మనం కోరికలు, బంధాల నుండి విముక్తులము కావాలి
-
నాల్గవది: దానికి చికిత్స ఈ 8 మార్గాలు (ఆర్య అష్టాంగ మార్గ)
- సుజ్ఞానము
- ఉన్నతమైన లక్ష్యం
- మంచి వాక్కు
- మంచి నడవడిక
- మంచి క్రియ
- తగినంత ప్రయత్నం
- ఏకాగ్రత
- ధ్యానం