Bhagavat Gita
11.15
తస్మాత్త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వాశత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం
{11.33}
మాయైవైతే నిహతాః పూర్వ మేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్
అందువలన నీవు లెమ్ము. శత్రువులను జయించి కీర్తిని పొందుము. సంపూర్ణ రాజ్య భోగము ననుభవింపుము. వీరందరును ఇదివరకే నా చేత చంపబడి యున్నారు. నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము
ద్రోణం చ భీష్మం చ జయద్రథ౦ చ కర్ణం తథా అన్యానపి యోధవీరాన్
{11.34}
మయా హతా౦స్త్వ౦ జహి మావ్యథిష్టాః యుధ్యస్వ జేతా అసి రణే సపత్నాన్
ఇదివరకే నా చేత చంపబడియున్న ద్రోణాచార్యుని, భీష్ముని, జయద్రథుని, కర్ణుని అలాగుననే ఇతర యుద్ధ ప్రముఖులను నీవు చంపుము. భయపడకుము. యుద్ధము చేయుము. శత్రువులను జయించగలవు ఀ
కౌరవుల పక్షాన ఉన్న వీరులలో భీష్ముడు, ద్రోణాచార్యుడు ముఖ్యులు. వారు అధర్మంతో, దుష్ట శక్తులతో కలిసి ఉన్నారు. వారు అజేయులని అర్జునుడు నమ్మేడు. శ్రీకృష్ణుడు వారికి అపజయం తప్పదని అర్జునునికి ధైర్యం ఇస్తున్నాడు.
మనం ఏనాటికైనా దుష్ట శక్తులను ఎదిరించి పోరాడాలి. గాంధీ మహాత్ముడు మనకు నేర్పిన పాఠం: దుష్ట శక్తులకు స్వతహాగా ఉనికి లేదు. అవి మనం కుట్ర చేసినప్పుడే వెలుపలకు వస్తాయి. మనం వినాశనానికి దారి తీసే శక్తులను సమర్థించకుండా ఉంటే అవి చంపబడతాయి. సత్యాగ్రహానిది ఇదే సిద్ధాంతం.
గాంధీ చిన్న వయస్సులో సౌత్ ఆఫ్రికా లో అప్పుడే ఉద్యోగాన్ని మొదలుపెట్టిన రోజుల్లో సత్యాగ్రహ సిద్ధాంతాన్ని కనిపెట్టేరు. ఆయన తెల్లవాడు కాదని మార్టిజ్ బర్గ్ అనే ఊరి రైల్వే స్టేషన్ లో దింపబడ్డారు. అది అంతకు ముందు వందలాది మందికి జరిగింది. కానీ అది గాంధీలో ఒక గొప్ప శక్తిని మేల్కొలిపింది; గాంధీకి దుష్ట శక్తులను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చింది. చాలా ఏళ్ల తరువాత ఒకరు ఆయనకు కలిగిన సృజనాత్మక శక్తి ఎక్కడ అధికంగా ఉందని అడిగేరు. అప్పుడు గాంధీ మార్టిజ్ బర్గ్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఉదాంతమని చెప్పెను. అప్పటినుంచి తాను జాతుల మధ్య ఉన్న భేదాన్ని రూపుమాపడానికి నిశ్చయించు కొన్నానని వివరించేరు.
గాంధీని అనేకమార్లు కారాగారాల్లో శిక్షించేరు. కాని అతడు నిరాశ చెందక, సంతోషంగా ఉండి, అధికారుల మన్నన పొందేరు. సౌత్ ఆఫ్రికా కారాగారంలో ఉన్నప్పుడు ఆయన జనరల్ స్మట్స్ అనే అధికారికి స్వయంగా చెప్పులు చేసేరు. చాలా ఏళ్ల తరువాత జనరల్ స్మట్స్ ఆ చెప్పులను తిరిగి ఇచ్చి "నేను ఆ గొప్ప మనీషి చెప్పులలో నుంచునే వాడంతటి వానిని కాను" అని చెప్పేరు. ఇటువంటి సంఘటనలు మనకు చెప్పే పాఠం: ఎవరైతే ఇతరులను తమ పేరుప్రతిష్ఠలకై మోసగించకుండా ఉంటారో వారిపై ప్రజలంతా హర్షాన్ని వ్యక్తం చేస్తారు. మనమట్టి మనీషి ముందు పూర్తిగా ఉపశమించి, ఎటువంటి స్పర్థ లేకుండా, మంచి ఏనాటికైనా చెడ్డపై గెలుపు సాధిస్తుందనే నమ్మకంతో ఉంటాము.