Bhagavat Gita
11.16
సంజయ ఉవాచ :
ఏతచ్చృత్వా వచనం కేశవస్య కృతాంజలి ర్వేపమానః కిరీటి
{11.35}
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గద౦ భీతభీతః ప్రణమ్య
అర్జునుడు శ్రీకృష్ణుని వచనముల నాలకించి చేతులు జోడించి వణకుచు శ్రీకృష్ణునికి నమస్కరించి, భయకంపితుడై, వినమ్రుడై గద్గద స్వరముతో ఇలా పలికెను
అర్జున ఉవాచ:
{11.36}
స్థానే హృషీకేశ! తవ ప్రకీర్త్యా జగత్పృహృష్య త్యనురజ్యతే చ
రక్షా౦సి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్య౦తి చ సిద్ధసంఘాః
హృషీకేశా! నీ వైభవమునకు జగత్తు సంతసించుచున్నది. అనురాగము పొందుచున్నది. రాక్షసులు భీతి చెందినవారై పలుదిక్కులకు పరుగులిడుచున్నారు. సిద్ధుల సమూహములన్నియు నీకు నమస్కరించుచున్నవి. ఇవి యన్నియు నీమహిమకు తగినవియే
కస్మాచ్చ తే న నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణో అప్యాదికర్త్రే
{11.37}
అనంత దేవేశ జగన్నివాస ! త్వమక్షరం సదసత్తత్పరం యత్
అనంతా! దేవదేవా! జగదాశ్రయా! సదసత్తులకు పరమమైన అక్షరపరబ్రహ్మవు నీవే. సృష్టికర్తయైన బ్రహ్మదేవునకు మూలకర్తవు. మహాత్ముడవైన నిన్ను ఎవరు నమస్కరింపకుందురు?
త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం
{11.38}
వేత్తా అసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప !
అనంతరూపా! నీవు దేవదేవుడవు. పురాణపురుషుడవు. ప్రపంచమునకు ఆధారమైన వాడవు. సర్వజ్ఞుడవు. తెలియదగినవాడవు. పరంధాముడవు. విశ్వము నీ చేత వ్యాప్తమై యున్నది. ఀ
అర్జునడు ప్రపంచము శ్రీకృష్ణుని నియంత్రణలో తన్మయత్వముతో ఉన్నదని తలచేడు. "నువ్వు సర్వ జీవుల రక్షకుడవు. జీవులన్నీ నీయందే విశ్రమించగలవు. నువ్వు గతంలో, భవిష్యత్తులో; సృష్టి ఆదిలో, అంతములో ఉన్నవాడివి" అని అర్జునుడు శ్రీకృష్ణుని స్తుతించెను. మరణంనుంచి అమృతత్వానికి తీసికెళ్ళే ఆధ్యాత్మిక పథం కత్తి మీద సామువ౦టిది. అట్టి పథంలో నడిచిన వారు -- ఏ మతస్తులైనా, జాతివారైనా -- ఇటువంటి అనుభవాన్ని పొందేరు. శ్రిరామకృష్ణ, శంకర, సెయింట్ తెరెసా ఆఫ్ ఆవిల, జలుల్-దిన్ రూమి, బాల్ షెం టోవ్ , జేకబ్ బోమి మొదలైనవారు తమ ప్రతి కణ౦తో స్పందించి అట్టి పదాలను ప్రయోగించేరు. ఇటలీ దేశస్తుడు జాకపోన్ ద టోడి ఇలా చెప్పెను:
తలుపులు తెరవబడినవి. దేవునితో ఐక్యమై, అది భగవంతుని అంతర్గత శక్తిని పొందినది; అదీ ఎప్పుడూ అనుభవించని దానిని అనుభవించింది; ఎప్పుడూ చూడనిది చూసింది; ఎప్పుడూ రుచి చూడనిదానిని రుచి చూసింది. తననుంచి స్వేచ్ఛను పొంది, అది పరిపూర్ణత పొందింది.
అట్టి దృశ్యం ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే అది విననంతనే దాని కొరకై కోరిక కలుగుతుంది. మనము అటువంటి ఎరుక గల వారిని కలిస్తే, మన కోరిక ఇంకా బలంగా అవుతుంది. మన కాగడా అట్టి వారి ద్వారా వెలిగించుకొంటాము. ఎందుకంటే వారు దేవునిపై ప్రేమతో ప్రజ్వలిస్తున్నారు.