Bhagavat Gita
11.17
వాయుర్యమో అగ్నిర్వరుణ శ్శశా౦కః
ప్రజాపతిస్త్వ౦ ప్రపితామహశ్చ
{11.39}
నమో నమస్తే అస్తు సహస్రకృత్వః
పునశ్చ భూయో అపి నమో నమస్తే
నీవు వాయువవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతివి. అతనికి తండ్రివి. నమోనమః దేవా! పునః నమోనమః
అర్జునుడు శ్రీకృష్ణుడు అంతటా, అందరిలోనూ ఉన్నాడని గ్రహించి సాష్టాంగ నమస్కారం పెట్టేడు. అతడు కంపిత స్వరంతో "నువ్వే విశ్వమంతా. కానీ నువ్వు దాని బయటనున్నావు. నువ్వు నా తల్లివి, తండ్రివి, తాతవి. నువ్వు అన్ని జీవులలోనూ ప్రకృతి శక్తులలోనూ ఉన్నావు" అని పలికెను. భగవంతుడు మీలోనూ, నాలోనే కాక, గాలిలోనూ, నదీసముద్రాలలోనూ, అన్ని శక్తి రూపాలలోనూ ఉన్నాడు. ఉనికి ఒక అఖండమైనది. దాని శకలాలలో మాత్రమే తారతమ్యం ఉంటుంది అందుకే మనము ప్రకృతిపై దోపిడీ చేస్తే బాధ పడవలసి వస్తుంది.
థామస్ వాఘన్ అనే ఆంగ్ల యోగి ఇట్లు చెప్పెను: "నీ హృదయ౦ ఆకాశంలో ఉంచు. నీ చేతులు భూమి మీద ఉంచు. చిత్తశుద్ధితో మీదకు వెళ్ళు. ఉదార బుద్ధితో క్రిందకు రా. ఇది కాంతి యొక్క ప్రకృతి. దాని బిడ్డల యొక్క మార్గము." యోగులైన యూదులు దేవుని విశ్వసించువారు ఆకాశానికి, భూమికి మధ్యనున్న నిచ్చెన వంటివారు అని చెప్పిరి. దేవుని నమ్మువారు అన్ని జీవులలోనూ దేవుని ఉనికి చూస్తారు.
ఇలా లేకనే కొందరు తక్కిన జీవులను తమ ఆనందానికై హింసిస్తారు. ఇది వేటకు మాత్రమే పరిమితం కాదు; పెంపుడు జంతువులయందు కూడా. కొందరు తమ పెంపుడు కుక్కలను తమతో శలవులలో వేరే చోటికి తీసికెళ్ళి అక్కడే వదిలేస్తారు. మరికొందరు పెంపుడు పిల్లులను ఇంట్లో బంధించి వేరే ఊరికి వెళతారు. అట్టివారిని నిందించకుండా, మనము జంతువులు మన సంరక్షణలో ఎందుకు ఉండాలో బోధించాలి.