Bhagavat Gita
11.7
తతస్స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః
{11.14}
ప్రణమ్య శిరసా దేవం కృతాంజలి రభాషత
అప్పుడు అర్జునుడు విస్మయమొంది, పులకాంకితుడై, చేతులు జోడించి, దేవదేవునకు శిరము వంచి నమస్కరించుచు ఇట్లనెను
అర్జున ఉవాచ:
పశ్యామి దేవాంస్తవ దేవ దేహే సర్వాంస్తథా భూతవిశేష సంఘాన్
{11.15}
బ్రహ్మాణమీశం కమలాసనస్థ౦ ఋషీ౦శ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్
ఓ దేవదేవా! నీ శరీరమందు సమస్తమైన దేవతలు, చరాచర భూతజాలములు, రుద్రుడు, కమలాస్థుడగు బ్రహ్మ దేవుడు, సకల ఋషులను, దివ్యములైన సర్పములను గాంచుచున్నాను ఀ
బృందావనములో బాల కృష్ణుడు పెరుగుతున్నప్పుడు, ఒక గోపిక యశోద వద్దకు వచ్చి కృష్ణుడు మన్ను తింటున్నాడని చెప్పింది. కృష్ణుడు తినటంలేదని చెప్పేడు. అప్పుడు ఆమె కృష్ణుని నోరు తెరిచి చూపమంది. కృష్ణుడు నోటిలో ఆమె జీవులతోనూ, నక్షత్రాలతోనూ మిరిమిట్లుగొలిపే విశ్వాన్ని చూసింది. అలా ఒక్క నిమిషమే జరిగుండవచ్చు. యశోద భయముతోనూ, ఆశ్చర్యంతోనూ చూసి ఉండవచ్చు.
అలాగే అర్జునుడు కూడా మాటల కందని స్థితిని పొందుతున్నాడు. ఎందరో ఆధ్యాత్మిక సాధకులు దేవుని చూచి నిశ్చేష్టులు అయినారు. యూదుల నాయకుడు మోసెస్, సినాయి కొండమీద దేవుని చూచి నిశ్శబ్దంగా కొండ దిగి వచ్చేరు. కానీ ఆయన ముఖం దేదీప్యమానంగా తేజస్సుతో వెలిగి యున్నది. సెయింట్ పాల్ డమాస్కస్ వెళ్ళే దారిలో దేవని కాంతిని చూసి మూడు రోజులు మంచం పట్టేరు. పాస్కల్ అనే గణిత శాస్త్రవేత్త దేవుని నిశ్చయము, మనో భావము, ఆనందము, శాంతి అనే పదాలతో వర్ణించేరు. సెయింట్ థామస్ ఆఫ్ అక్వినాస్ "నేను వ్రాసినదంతా గడ్డిపోచతో సమానము" అని దేవుని దర్శించి చెప్పెను. నేటి భౌతిక శాస్త్రవేత్తలు, శ్లోకంలో చెప్పిన ఋషులు, కవిత్వంతో మాత్రమే చెప్పగలరు.
ఇటువంటి దర్శనాన్ని మాటలతోనూ, చిత్రాలతోనూ చెప్పలేము. కానీ దానిని సూక్ష్మంగా చెప్పవచ్చును. ఆధ్యాత్మిక గురువులు మాటలకన్నా చేతలతో తమ బోధ చెయ్యాలి. వారు సర్వ జీవ సమానత్వము గూర్చి ఎరిగి, అది వారి ప్రతి క్రియలోనూ వ్యక్త మవుతుంది. ఏ శిష్యులైతే దానిని హృదయంతో గ్రహిస్తారో వారు కూడా నిత్య జీవితంలో దాన్ని అనుసరించవచ్చు. నేను ఆధ్యాత్మిక సాధన నా అమ్మమ్మ నుంచి పొందేను. ఆమె నాకేమీ పెద్దగా బోధించలేదు. కానీ నేను యోగ౦ గురించి చదివిన గ్రంధాల కన్నా, ఆమె దగ్గర నేర్చుకొన్నది ఎక్కువ. ఆమె ఆధ్యాత్మికత గురించి అతి తక్కువగా మాట్లాడేది. కానీ ఆమె ఎరుకను సమర్థతతో నాకు పంచి ఇచ్చింది. నాకిది ఎన్నో ఏళ్లు తరువాత ధ్యానం చేయడం మొదలు పెట్టినప్పుడు తెలిసింది. ఆమె ఎన్నటికీ నా ప్రథమ గురువు. చాలా మందికి గురువును వెతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ నేను గురువుకి వారసుడను. నేను ప్రతి రోజూ ఆమెలా అవుతూ, ఆమె ప్రేమతో నా చిన్నప్పుడు చెప్పిన జీవుల ఐకమత్యము నిత్య జీవితంలో పాటిస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది