Bhagavat Gita
11.8
అనేక బాహూదరవక్త్ర నేత్రం
పశ్యామిత్వాం సర్వతో అనంతరూపం
{11.16}
నాంతం న మధ్యం న పునస్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప !
విశ్వేశ్వరా ! విశ్వరూపా! అన్ని చోట్లను అనేకమైన బాహువులును, ఉదరుములును, ముఖములును, నేత్రములును, కలిగిన అనంతరూపునిగ నిన్ను గాంచుచున్నాను. నీ రూపమునకు మొదలుగాని, మధ్యముగాని, అంతము గాని గోచరించకున్నవి
శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము. విష్ణు సహస్ర నామములు ఆయనకీ వర్తిస్తాయి. ఒకమారు భూమాత పాప భారం భరించలేక శ్రీ మహావిష్ణువుని రక్షింపమని వేడుకొంది. అప్పుడు ఆయన శ్రీకృష్ణ అవతారం దాల్చేడు. దేవకీ, వసుదేవులకు జన్మించి, కంసుని దురాగతములను తప్పించుకొనుటకై, యశోద, నందులకు దత్త పుత్రుడైనాడు. ఆ పసికందు నామకరణం చేయడానికి గార్గ ఋషుని కోరేరు. ఆయన పసికందుని చూసి "సహస్ర నామములుండగా నేనే నామాన్ని పెట్టేది?" అని వాపోయేడు.
దేవుడు మనందరిలోనూ ఉన్నాడు. మన పేర్లన్నీ ఆయనకే చెందుతాయి. అంటే ఆయన సహస్ర నామములకే పరిమితం కాదు. కోట్ల ప్రపంచ జనాభా పేర్లన్నీ ఆయనవే. ఎందుకంటే వారి హృదయాల్లో ఆయన నివసిస్తున్నాడు. అర్జునుడు చూస్తున్న అసంఖ్యాకమైన ముఖములు, చేతులు ఊహా జనితం కాదు. రామదాసు ఇలా చెప్పెను:
మనము ఏ జీవిని చూసిన దాని బాహ్య రూపమే కాక అంతరంలో ఉన్న ఆత్మను చూడాలి. ఈ విధంగా చూడడం నిజమైన ప్రక్రియ. దానివలన మన౦ భిన్నత్వాన్ని అతిక్రమించి జీవుల ఐకమత్యాన్ని గ్రహిస్తాము. ఇదే ఋషులు చెప్పేది. అలా ఉండడం పుణ్య క్షేత్రాలకే పరిమితం కాదు. మన దినచర్యలో, బజార్లో, అన్ని చోట్లా, భిన్నత్వాన్ని చూడక సమానతను పాటించాలి. అందరిలోని దైవత్వాన్ని దర్శించాలి.