Bhagavat Gita
2.10
మాత్రా స్పర్శాస్తు కౌన్తేయ శీతోష్ణ సుఖదుఃఖదాః
{2.14}
ఆగమాపాయినో అనిత్యాః తాం స్తితిక్షస్వ భారత
కౌన్తేయా! ఇంద్రియములు ఇంద్రియ విషయములతో సంయోగము చెందునపుడు శీతోష్ణ సుఖదుఃఖములు సంభవించుచుండును. అవి ఉత్పత్తినాశములు గలవి. అస్థిరమైనవి. కనుక భారతా! వానిని సహింపుము
మన భౌతిక శరీరము ఇతర భౌతిక పదార్థాలతో సంబంధం పెట్టుకుంటే దానికి కారణము మనము కాదు. అందుకే శ్రీకృష్ణుడు "నీవు భౌతిక పరమైన సంబంధాలవలన ఆశనిరాశలు ఎందుకు అనుభవిస్తున్నావు?" అని అర్జునుని అడుగుతున్నాడు.
ఈ రోజుల్లో నిరాశ (depression) ఒక మహమ్మారిలా ఉంది. గీత ఇచ్చే సలహా: నీవు ఎప్పుడైతే ఎంతో ఆనంద౦తో ప్రేరేపితమై ఉన్నావో, ఎన్నో గొప్పకార్యములు విజయవంతంగా ముగించేవో, అదృష్టంచే వరించిబడ్డావో, ఇతరులతో అతిగా మాట్లాడి ఎంత ఆనందంగా ఉన్నావో చెప్దామనుకున్నావో, అప్పుడు మనోభావాలను నియంత్రించి నిర్లిప్తంగా ఉండాలి. నీవు రచయితవైతే, నీ పుస్తకములకు విశేషమైన ఆదరము లభించి, నీకు సన్మానం చేస్తామని ఆహ్వానాలొస్తే ఉవ్విళ్లూరుతూ వెళ్ళడం గీత చెప్పేదానికి వ్యతిరేకం. అలాంటి సమయాల్లో ప్రత్యక్షంగా గానీ, ఫోనుల్లోగానీ అతిగా మాట్లాడకూడదు. ఆ సమయాల్లో మంత్ర జపమే మనకి రక్ష.
హర్షోద్వేగం అనేక విధాలుగా వ్యక్తమవుతుంది. కొందరు అతిగా మాట్లాడుతారు. మరికొందరు భవిష్యత్తు గురించి ఆలోచించి గాలిలో మేడలు కడతారు. ఎంతో నిరాడంబరమైన, వినయవిధేయలతో కూడిన వారలకైనా హర్షోద్వేగాన్ని నియంత్రించుకోవడం కష్టం. అలాంటిది సామాన్యులమైన మనకు ఎంత కష్టమో చెప్పనక్కరలేదు. ముఖ్యంగా నటులు, రచయితలు మొదలగు కళాకారులు హర్షోద్వేగానికి లోనవుతారు. వారు సన్మానాలు, గౌరవాలు, బిరుదులు వస్తాయని శోభాయమానమైన భవిష్యత్తుకై నిచ్చెనలు వేసుకొంటారు. గీత మననిక్కడ హర్షాన్ని నియంత్రించుకోమంటుంది. హర్షోద్వేగము కలిగినప్పుడు మంత్రం జపిస్తూ, నిర్లిప్తంగా ఉండడం శ్రేష్ఠము.
మనకు నిరాశ కలిగినప్పుడు "నా నిరాశను ఉంకొకరికి కలిగించను" అనే సద్భావంతో ఇతరులితో వేర్పడి ఉండవచ్చు. అంటే నిరాశని ఒక అంటు వ్యాధిగా భావించవచ్చు. అలా చెయ్యడం ఎన్నటికీ సరి కాదు. దానివలన నిరాశ ఇంకా ఎక్కువవుతుంది. మనం చుట్టూ ఒక చెరసాలను కట్టుకొని ఒంటరిగా బ్రతుకుతాం. కానీ ధ్యానం చేసి, మంత్రోచ్చారణ చేస్తూ, చిరునవ్వుతో ఉంటే మనలో మంచి మార్పులు కలిగి నిరాశను అధిగమిస్తాం.
మన హర్షోద్వేగాన్ని నియంత్రించుకోవడం దుఃఖం లేదా నిశ్చేష్టతో కూడి ఉండడం కాదు. నిర్లిప్తంగా ఉంటే మన చేతన మనస్సుల లోతులనుండి భద్రత, ఆహ్లాదాన్ని తోడుకొని తెస్తాం. ఏదైతే మన హర్షోద్వేగానికి కారణమో, అది కొంతకాలానికి మనను నిరాశ చెందేలా చేస్తుంది. కొందరు మాదక ద్రవ్యాలు సేవిస్తూ మిక్కిలి ఆనందనికై అర్రులు చాస్తారు. ఎప్పుడైతే మనం ఇంద్రియాలను ఆనందానికై ప్రేరేపిస్తామో మనకక్కడ నిరాశ తప్పదు.
ఆశనిరాశలు ద్వ౦ద్వాలు. అంటే ఒకదానిని వెనుకపెట్టుకొని ఉ౦కొకటి వస్తుంది. అలాగే సుఖదుఃఖాలు, చలి వేడి కూడా ద్వ౦ద్వాలు. సమాధి పొందుటకై శ్రీకృష్ణుడు "సమత్వ యోగ ఉచ్యతే" -- అనగా ద్వంద్వాలు ఉన్నప్పుడు మనస్సు సమతుల్యంగా ఉండాలి -- అని సూచిస్తున్నాడు. 64
No comments:
Post a Comment