Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 11

Bhagavat Gita

2.11

యం హి న వ్యథయం త్వేతే పురుషం పురుషర్షభ {2.15}

సమదుఃఖ సుఖం ధీర౦ సో అమృతత్వాయ కల్పతే

పురుషశ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఈ మాత్రాస్పర్శములు సుఖదుఃఖముల యందు సమబుద్ధి కలిగిన ఏ ధీర పురుషుని బాధించలేవో అట్టివాడు కదా మోక్షము నొందుటకు అర్హుడగును

అనేక మతాలలో మరణాన్ని జయించే మార్గం చూపిస్తామనేవారు ఉన్నారు. వారి భక్తులు అది ఒక ఉపమానమని, దానికి శాస్త్రపరమైన ఊత లేదని తలుస్తారు. కానీ యోగులు కాలమే భ్రాంతి అని, అమృతత్త్వమే నిజమని అంటారు.

మనము మన బంధు మిత్రుల మరణ వార్తలను అప్పుడప్పుడు వింటూ ఉంటాము. కానీ వాటిపై "మరణం నాకూ కలుగుతుందా? దాన్ని దాటే మార్గం లేదా?" అని స్పందించము. నేను చిన్నప్పుడు నా గ్రామంలో అనేక మరణాలు చూసేను. ఎందుకంటే నా అమ్మమ్మ గ్రామంలో ఎక్కడ మరణం సంభవించినా నన్ను తోడు తీసికెళ్ళేది. అది నన్ను చాలా కలత పెట్టేది.

నా అమ్మమ్మ ఎందుకు అలా చేసేదో పెద్దయ్యేక తెలిసింది. ఆమె నన్ను మరణాన్ని అధిగమించే మార్గాన్ని అన్వేషించమని ప్రేరేపిస్తున్నాది. ఆవిడ ప్రేరణ వలన నేను తెలిసికున్న దేమిటంటే నడివయస్సులో కూడా నేను మరణంలో ఉన్నానని. అందువలన మరణాన్ని దాటి అమృతత్త్వాన్ని పొందాలని నిశ్చయించుకొన్నాను. నా సాధన కొనసాగుతున్నకొద్దీ మరణం గురించి నాలో ఉన్న భయాన్ని దాన్ని అధిగమించే శక్తిగా మార్చుకున్నాను.

ఐన్స్టీన్ ను ఒకరు తన సిద్ధాంతాలను ఎలా కనుకున్నారని అడిగేరు. ఆయన అంతకు ముందు ప్రపంచమంతా అంగీకరించిన సిద్ధాంతాలను ప్రశ్నించేనన్నారు. అలాగే ధ్యానంవలన మనలో మరణము తప్పదా అనే ప్రశ్నని అడగగలుగుతాం. ఇది ఒక తార్కికమైన విషయం కాదు. స్వీయానుభవం వలన మనకు విదితమయ్యేది మనకు మరణము లేదని. ఆ అవగాహన మనలను ఉత్తేజ పరిచి, చిన్న చిన్న కోరికలను త్యజింపజేసి, చివరకు మన శక్తినంతా అమృతత్త్వానికై వెచ్చి౦పజేయిస్తుంది.

గీత చెప్పేది మనం దేహంతో తాదాత్మ్యం చెందినంత కాలం మరణము తప్పదని. ధ్యానంలో దేహం మీదున్న స్థిరభావాన్ని తొలగించుకుంటాం. మన సాధన వలన భౌతికమైన చేతనాన్ని దాటి, స్వేచ్చాయుతమైన పురోగతిని పొందుతాము. 66

No comments:

Post a Comment

Juror Types

Before I proceed with juror types on a light-hearted note, I will point out that both current VP JD Vance and his telugu wife have law ...