Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 9

Bhagavat Gita

2.9

దేహినో అస్మిన్ యథాదేహే కౌమారం యౌవనం జరా {2.13}

తథా దేహాంతరప్రాప్తి ర్ధీర సత్ర న ముహ్యతి

జీవునకు ఈ దేహమునందు బాల్యము, యౌవనము, వార్ధక్యము ఎలా కలుగుచున్నదో అలాగే మరణానంతరము మరియొక దేహమును పొందుట జరుగుచున్నది. ధీరుడు ఈ విషయమై భ్రమపడడు. ఀ

చిన్నప్పుడున్న మన దేహం పెద్దయ్యేక అనేక మార్పులు చెందుతుంది. అలాగే మరణించిన పిదప ఆత్మ ఉంకో క్రొత్త శరీరాన్ని ధరిస్తున్నాదని శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు. ఇటువంటి పునర్జన్మ సిద్ధాంతాన్ని ఆధ్యాత్మిక చింతనకు అవసరం లేదు. కానీ అది మనలను ఉత్తేజ పరుస్తుంది. కొందరు యోగులు పునర్జన్మలేని స్థితికై సాధన చేస్తారు. దాన్ని కొందరు మోక్షమంటారు. ఈ నేపథ్యంలో పునర్జన్మ గురించి శాస్త్రజ్ఞులు ఎన్నో గ్రంథాలు వ్రాసేరు. సోమర్ సెట్ మాహమ్ అనే రచయిత 1930 లో రమణ మహర్షిని కలిసి ఉత్తేజితుడై రాజర్స్ ఎడ్జ్ అనే పుస్తక౦లో పునర్జన్మ గురించి వ్రాసేరు.

కొందరు "మనకు గత జన్మ విశేషాలు ఎందుకు గుర్తుకు లేవు?" అని ప్రశ్నిస్తారు. నిజానికి మనకీ జన్మ విశేషాలే పూర్తిగా గుర్తులేవు. మన రెండవ జన్మదినము ఎక్కడ, ఎలా జరిగిందో మనకెవ్వరికీ గుర్తులేదు. అంటే మనమప్పుడు లేమా? ఉన్నాము కానీ గుర్తులేదు.

ఈ క్రమంలో శ్రీకృష్ణుడు మరణం గురించి చెప్తాడు. కార్ల్ జంగ్ అనే గొప్ప మానసిక శాస్త్రవేత్త ప్రతి మనిషికి అచేతన మనస్సులో మరణం గురించి ఎన్నో భయాలు ఉంటాయన్నారు. అది ప్రాణాలర్పించడానికి సిద్ధపడిన సైనికులవంటి వారలకు కూడా వర్తిస్తుంది. ధ్యానంలో పరిపక్వత పొందితే మరణము గురించి భయం క్రమంగా పోతుంది. ఇది భౌతిక చేతనాన్ని దాటి వెళ్తున్నా మనడానికి సంకేతం. రమణ మహర్షికి 17 వ ఏటనే జ్ఞానోదయం కలిగింది. ఆయనతో మనము మరణం గురించి మాట్లాడితే "నేను 17 వ ఏటనే మరణించేను" అంటారు. సమాధిలో నేను, నాది అనే భావాలు లేక, అనగా అహంకారం లేక, మరణాన్ని అనుభవిస్తాము. సెయింట్ పాల్ "నేనుకాదు. నాలో జీసస్ క్రైస్ట్ నివసిస్తున్నాడు" అన్నారు. తర్కం దృష్ట్యా అహంకారం పడిపోతే, ఇక మరణించడానికి మిగిలేది ఎవరు? మనము పరుల సంతోషానికై వారిని మనకన్నా ముఖ్యులుగా తలుస్తే, మన అహంకారం తగ్గి, ఆత్మకు చేరువై, భగవంతుని చేతన మనస్సుతో పట్టుకుంటాం. 62

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...