Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 12

Bhagavat Gita

2.12

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః {2.16}

ఉభయోరపి దృష్టో అన్త స్త్వనయో స్సత్త్వదర్శిభిః

లేనిది ఉండేది లేదు. ఉన్నది లేకపోయేది లేదు. ఈ రెండింటి యొక్క తత్త్వము జ్ఞానులచే దర్శింపబడినది

అర్జునుడు తాను దేహానికే పరిమితమని ఇంతవరకు నమ్మేడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అతడు ఒక రోజు ఉండి, మరొక రోజు పోయే దేహంతో తాదాత్మ్యం చెందేడని, దేహము ఆత్మ యొక్క తాత్కాలిక నివాసమని చెప్తున్నాడు.

శ్రీకృష్ణుడు ఏదైతే సత్యమో, ఏదైతే అసత్యమో వివరిస్తున్నాడు. దేనికి పుట్టుక ఉందో, దానికి మరణం ఉంది. కాబట్టి పుట్టి పోయేవి అసత్యములు. ఈ లెక్కన దేహం అసత్యం.

మహాత్మా గాంధీ సంస్కృత పదం సత్ కి రెండు అర్థాలు చెప్పేరు: ఒకటి సత్యం, మరొకటి ఉనికి. ఆయనను దేవుడనగా ఏమిటి అని అడిగితే "సత్యమంటే దేవుడు. దేవుడొక్కడే ఉనికి కలవాడు. తక్కిన వాటికి ఉనికి లేదు" అని చెప్పేరు. ఆయన ప్రజలకి దుర్మార్గం అన్నదాన్ని ఒకరు పెంపొందిస్తే తప్ప దానికి స్వతహాగా ఉనికి లేదు అని చెప్పేరు. మనం దుర్మార్గానికి ఊత తీసివేస్తే అది రూపుమాపు అవుతుంది.

ఎవరైతే మహోత్కృష్టమైన సత్యాన్ని గ్రహిస్తారో వారికి ఏదైతే అసత్యమో దానికి ఉనికి లేదని తెలుసు. అర్జునునుకి మనలాగే శ్రీకృష్ణుడు చెప్పేది సులభంగా అవగతం కాదు. అందుకే దేవుడు యోగులకు మారే ప్రపంచంలో, శకలాలగా ఉన్న సృష్టిలో, మారని తత్త్వం ఒకటి ఉన్నాదనే జ్ఞానాన్ని ఇచ్చేడు. మనలో చాలామందికి అటువంటి జ్ఞానం లేదు. మనలను శకలాల మనుకొంటూ, దేహం మీద కోరికతో ఉంటే, మనము భౌతికమైన, సదా మార్పుచెందే ప్రపంచంతో లావాదేవీలే సత్యమని నమ్ముతాము. మనమనుకోవలసినది: నేను నిజం. మనమందరమూ నిజం. జీవులన్నీ ఏకమని తలచినా మనకిష్టమైన వారితో బాంధవ్యాలు పెంచుకోవచ్చు. జీవులన్నీ ఏకమని నమ్మినా, వ్యక్తికి వ్యక్తికి మధ్యనున్న తేడాబట్టి మన ప్రేమను పంచుకోవచ్చు. 67

No comments:

Post a Comment

PPP in Andhra means Prostrate Pray Physicians

Recently there has been much debate about the PPP. If we ask google what is PPP, we will be informed: Purchasing Power Parity, Private Pu...