Bhagavat Gita
12.13
అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్
{2.17}
వినాశ మన్యయప్యాస్య న కశ్చి త్కర్మ మర్హతి
ఈ సమస్తము దేనిచేత పరివ్యాప్తమై యున్నదో అది అవినాశి యని గ్రహింపుము. అవినాశి యగు దీనిని ఎవ్వరును నాశనము చేయలేరు
అంత వంత ఇమే దేహానిత్యస్యోక్తా శ్శరీరిణః
{2.18}
అనాశినో అప్రమేయస్య తస్మా ద్యుధ్యస్వభారత
అర్జునా! నిత్యుడును, అవినాశియు, అప్రమేయుడును అగు దేహియొక్క ఈ దేహములు అంతము గలవిగా చెప్పబడినవి. కనుక యుద్ధము చేయుము
మన దేహం ఏదో ఒకనాడు పోయేదే. కానీ ఆత్మ శాశ్వతం. మనకు అంతము లేదు ఎందుకంటే మనము దేహము కాము కనుక. మన దేహంలోని కణాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. అలాగే మన మనస్సులోని ఆలోచనలు కూడా ఇంకా వేగంగా కదులుతాయి. దీన్నే సంసార మని అంటారు. అంటే ఏదైతే వేగంగా కదులుతూ, మరణిస్తూ, జన్మిస్తూ ఉండేది.
మనమెప్పుడైతే మార్పు చెందేదాన్ని పట్టుకొని వేళ్ళాడతామో అప్పుడు కాలం గడుస్తున్న కొద్దీ అభద్రత కలుగుతుంది. మనం దేహంతో తాదాత్మ్యం చెందితే వృద్ధాప్యంలో మొహం మీద ముడతలు, నెత్తి మీద వెంట్రుకలు రోజూ చూసుకుంటూ ఉంటాం. మనం దేహాన్ని ఆశ్రయిస్తే రోజురోజుకీ మన సౌందర్యాన్ని కోల్పోతా౦. అలాకాక మనం ఇతరులకు సేవ చేయడానికై దేహాన్ని ఎప్పుడైతే వాడుతామో అప్పుడు మన భౌతిక శరీరం ఆరోగ్యంతో, సౌందర్యంతో అలరారుతుంది. శ్రీ రామకృష్ణ కలకత్తా వీధులలో నడుస్తూ ఉంటే ఆయన శరీరం ప్రకాశవంతమై అందరినీ ఆశ్చర్యపరిచేది.
శరీరం మనలో దేవుడు నివసించే గుడి. నా అమ్మమ్మ 77 ఏళ్లప్పుడు కూడా ఎంతో తేజోవంతంగా ఉండేది. ఆమెకు దేహమనబడే గుడిని స్వస్థతగా ఉంచాలి; మంత్రమనే చీపురుతో శుభ్రం చెయ్యాలి; ధ్యానంతో ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకొని దేహాన్ని శుద్ధి చేసుకోవాలి అని తెలుసు. మనం దేవునియందు భక్తి దేహాన్ని పరిశుద్ధంగా ఉంచి చూపాలి. దేహాన్ని దుర్వినియోగం చేసి, ఇంద్రయాలతో దాన్ని దురుపయోగం చేస్తే అది దేవునిని అవమానించడమే. పుస్తకాలు, సినిమాలు, టివి, తినే పదార్థాల విషయాల కొస్తే మన ఇంద్రియాలు మనస్సును, దేహాన్ని అవి ప్రేరేపించనవిగా ఉండాలి. ఆధ్యాత్మిక సాధన మార్గంలో ఉన్న వారల కూడా ఇంద్రియాల విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. మనము దేహముకాదు, ఆత్మ స్వరూపులమని తెలిసుకోడానికి కూడా మన ఇంద్రియాలు స్వాధీనంలో ఉండాలి. ఒక్కమాటలో మన ఆధ్యాత్మిక సాధనకు దేహమొక పనిముట్టు. అది లేనిదే సాధన సాగదు.
ఇంతవరకూ దేహాన్ని స్థూలంగా చూసేము. మనకి సూక్ష్మ శరీర మనబడేది ఉంది. మన ఆలోచనలు సూక్ష్మశరీరానికి ఆహారం. మన సంస్కారాలు, మానసిక భావాలు దాన్ని ప్రభావితం చేస్తాయి. మన మనస్సులో చెడు లేదా మంచి ఆలోచన వస్తే సూక్ష్మ శరీరానికి అనుచితమైన లేదా పోషణకరమైన ఆహారాన్ని ఇస్తాము. మనస్సులో కలిగే క్రోధం, ద్వేషం, విరోధం అనబడే చెడు లక్షణాలు, మన భౌతిక శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. మన సూక్ష్మ శరీరాన్ని శుద్ధంగా, ఆరోగ్యంగా ఉంచాలంటే మనము క్షమించడమనే సద్గుణాన్ని అలవరచుకోవాలి 70
No comments:
Post a Comment