Bhagavat Gita
2.14
య ఏవం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం
{2.19}
ఉభౌ తా న విజానీతో నాయం హంతి స హన్యతే
న జాయతే మ్రియతే వా కదాచి న్నాయం భూత్వా భవితా వా న భూయః
{2.20}
అజో నిత్య శ్శాశ్వతో అయం పురాణో న హన్యతే హస్యమానే శరీరే
ఆత్మ పుట్టేది గాదు, గిట్టేది కాదు. గతములో లేకనే నూతనముగ తెలియునది కాదు. ఆత్మ పుట్టుకలేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. దేహము నశించినను ఆత్మ నశించదు
శ్రీకృష్ణుడు మనయొక్క నిజ స్వరూపాన్ని చెప్తున్నాడు. న జాయతే అనగా మన మెప్పుడూ పుట్టలేదు. న మ్రియతే వా అనగా మన మెప్పటికీ మరణించం. న యం భూత్వా భవితా వా న భూయాః అనగా మనము మార్పు చెందలేదు, మార్పు చెందము. అజ అనగా ఎప్పుడూ పుట్టనిది. నిత్య అనగా ఎల్లప్పుడూ ఉండేది. శాశ్వత అనగా నిత్యం మార్పులేకుండా ఉండేది.
కేరళలోని గురువాయూర్ మందిరంలో శ్రీకృష్ణుని విశేషంగా కొలుస్తారు. ఉదయం బాల కృష్ణునికి సేవ చేస్తారు. దానిని చూడడానికి ఆబాలగోపాలం వస్తారు. మధ్యాహ్నం యువకుడైన శ్రీకృష్ణునికి --అంటే నిటారుగా నుంచొని, నెమలి పింఛాన్ని ధరించి, మెడలో పూల మాల వేసి, పట్టు వస్త్రాలను ధరించి, చేతిలో వేణువును పట్టుకొన్న అవతార మూర్తిని--పూజ చేస్తారు. అనేక యువకులు దానిని వీక్షించడానికి వస్తారు. సాయంత్రం శ్రీకృష్ణుని ఒక వృద్ధునిగా చూపిస్తారు. ఆయనను సేవించడానికి అనేక వృద్ధులు వస్తారు. ఈ త్రివిధాలుగా చూపించే ప్రక్రియ మన దేహానికి సంబంధించినది. మనము సదా మార్పు చెందే భౌతికతకు అతీతంగా వెళ్ళాలి 71
No comments:
Post a Comment