Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 15

Bhagavat Gita

2.15

వేదానినాశినం నిత్యం య ఏవ మజ మవ్యయమ్ {2.21}

కథం స పురుషః సార్థ కం ఘాతయతి హన్తి కమ్

పార్థా! ఈ ఆత్మను ఎవడు నాశములేని దానిని గను, నిత్యమైన దానిని గను, పుట్టుకలేని దానిని గను, అక్షయమైన దానిని గను గ్రహించుచున్నాడో అట్టి పురుషుడు ఎవరిని ఎటుల చంపించును? ఎవరిని ఎటుల చంపును?

వాసా౦సి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి సరో అపరాణి {2.22}

తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహే

మనుష్యుడు చినిగిన వస్త్రములను వదలి క్రొత్త వస్త్రములను ధరించుచున్నాడో, అట్లే జీవుడు శిథిలములైన పాత శరీరములను వదలి అన్యములగు నూతన శరీరములను ధరించుచున్నాడు ఀ

శ్రీకృష్ణుడు శరీరమును వస్త్రముతో పోలుస్తున్నాడు. ఎలాగైతే చిరిగిన వస్త్రాన్ని మనం పారేస్తామో, అలాగే దేహము ఇతరులకు సేవ చేయుటానికి ఉపయోగపడకపోతే దానిని విడిచిపెడతాం. కాబట్టి దేహాన్ని పట్టుకు వేళ్ళాడకూడదు. రమణ మహర్షి అంత్యకాలంలో అనేక మంది భక్తులు విలపించేవారు. అప్పుడు ఆయన "నా శరీరము మీకు ఉపయోగపడకుండా ఉంది. అది ఉపయోగపడేవరకు, నేను దాన్ని ఉంచుకొంటాను. కానీ అది నిరుపయోగమయ్యే సమయం వస్తే , నేను దాన్ని విడిచిపెడతాను" అని అన్నారు.

నా అమ్మమ్మకు మరణం బాధాకరమైన విషయం కాదు. ఎందుకంటే ఆమె ఆత్మ శాశ్వతమని నమ్మింది. మన బంధుమిత్రులలో ఒకరు పోతే మన మెంతో బాధపడతాము. కానీ యోగులు మరణం ఒక గది నుంచి వేరొక గదికి మారినట్లని చెప్తారు. అంటే వారు దేహాంతర ప్రాప్తి లేదా పునర్జన్మము గురించి చెప్తున్నారు. ఆధ్యాత్మిక సాధనికి మనము దేహాంతర ప్రాప్తి లేదా పునర్జన్మము నమ్మనక్కరలేదు. మనము ఒక జన్మ ఎత్తినా, కోట్ల జన్మలు ఎత్తినా, లక్ష్యమొక్కటే. అలాగే ధ్యానం కూడా అందరికీ వర్తిస్తుంది. కాబట్టి మన సావధానత ఈ ప్రస్తుత జన్మపై నుంచి, సాధ్యమైనంత వరకు దేవుని ప్రేమించడం ఇప్పుడే, ఇక్కడే చెయ్యాలి. 73

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...