Bhagavat Gita
12.16
నైనం ఛి౦దంతి శస్త్రాణి నైనం దహతి పావకః
{2.23}
న చైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః
ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపలేవు. అగ్ని దహింపలేదు. నీరు తడుపలేదు. గాలి శోషింప జేయలేదు.
అఛ్ఛేద్యో అయ మదాహ్యో అయ మక్లేద్యో అశోష్య ఏవ చ
{2.24}
నిత్యస్సర్వగత స్స్థాణు రచాలో అయం సనాతనః
ఈ ఆత్మ ఛేదింపబడదు. దహింపబడదు. తడుపబడదు. ఎండింపబడదు. అది నిత్యమైనది, సర్వగతమైనది, స్థిరమైనది, అచలమైనది, సనాతనమైనది.
అవ్యక్తో అయ మచి౦త్యో అయ అవికార్యో అయ ముచ్యతే
{2.25}
తస్మా దేవం విది త్త్వైనం నాను శోచితు మర్హసి
ఈ ఆత్మ వ్యక్తముకాదు. చింతించుటకు వీలుపడదు. వికారములేనిదని చెప్పబడినది. ఈ విధమైన ఆత్మను తెలిసికొని నీవు శోకించుట మానవలెను
అర్జునునికి శ్రీకృష్ణుడు చెప్పే ఆత్మ అంతుబట్టలేదు. అందుకై శ్రీకృష్ణుడు మనందరికీ మన ఉనికి యొక్క నిజ స్వరూపామును విసిదీకరిస్తున్నాడు. మన నిజ స్వరూపము 3 సంస్కృత పదాలతో వివరింపబడినది: అవ్యక్త అయం--అనగా వ్యక్తము కానిది, నిఘూడంగా ఉన్నది; అచింతయ అయం--అనగా ద్వంద్వాలకు అతీతమై విశ్లేషించుటకు కష్టమైనది; అవికార్యో అయం--అనగా మార్పు చెందనిది. మన ఆత్మ స్వరూపము సంపూర్ణమైనది. ఈ మూడు అంశాలను మన ఆత్మ స్వరూపముపై ఆపాదిస్తే మనము దేహేంద్రియ మనోబుద్ధులకు అతీతులమని తెలుస్తుంది.
ముందు చెప్పినట్లు అవ్యక్త అనగా పూర్తిగా వ్యక్తమవ్వనిది. మనము దేహముపైనే దృష్టి పరిమితం చేసికొని అపరిమితమైన, అమృతమైన, మార్పులేని ఆత్మను దర్శించలేకున్నాము.
మైస్టర్ ఎక్ హార్ట్ ఆత్మను మనందరిలోనూ ఉన్న దేవుని యొక్క బీజంగా పరిగణించేరు. ఎలాగైతే ఆపిల్ విత్తు ఆపిల్ చెట్టులా, నారింజ విత్తు నారింజ చెట్టుగా పెరుగుతాయో, దేవుని బీజము దేవుని చెట్టుగా పెరుగుతుంది. ఈ నేపధ్యంలో వ్యక్తమనగా మనలోని గుప్తంగా ఉన్న దైవీ సంపదని బహిర్గతం చెయ్యడమే మన యొక్క లక్ష్యం. ఎలాగైతే కలుపు మొక్కలను తీసివేస్తే విత్తనం పెరిగి పెద్దదవుతుందో, అలాగే మనల్ని కూడా శుద్ధి చేసికొంటే దేవుని బీజం చిగురుస్తుంది.
మనలోని గుప్తమైన దైవ గుణాలని ఎలాగ బయటకు తెస్తామని ప్రశ్న కలగవచ్చు. కొందరు స్వార్థంతో, అభద్రతో బ్రతుకుతారు. వారు ఎప్పుడూ ప్రతీదాన్నీ, ప్రతి వ్యక్తిని స్వలాభానికై ఎలా వాడుకోవాలా అని ఆలోచిస్తారు. అలా౦టివారు తాము సున్నితమైన వారలమని చెప్పుకుంటారు. కొందర సున్నితమంటే చెప్పులు వేసికోకుండా ఇంట్లో నడుస్తే కలిగే బాధ అని చెప్పవచ్చు. యోగులు చెప్పే సున్నితత్వము ఇతరుల బాధలను అర్థం చేసికోవడం. మనము పరులకై పాటు పడితే, మనకు కలిగే బాధlu, కలవరము, ద్వేషం నుండి విముక్తులమవుతాము.
నా అమ్మ చెప్పిందే మళ్ళీ చెప్తూ ఉంటుంది. నేను ఆమె నామీద నమ్మకం లేక కాదు అని తలుస్తాను. ఆమెకు తెలుసు ఉద్యోగ రీత్యా నేను మతిమరుపు మనిషినని. మనము మన తలిదండ్రులు మన క్షేమమే సదా కోరుతారని, భార్యా పిల్లలు మనకి ఆహ్లాదం ఇస్తారని మనసారా నమ్మితే వారు చేసే ఏ పనీ మనను బాధించదు. నా అమ్మ అప్పుడప్పుడు కటువుగా ఉంటుంది. నేను ఆమెను తప్పు బట్టను. మన బంధుమిత్రులపై మిక్కిలి నమ్మకం లేకపోతే, ఎటువంటి మృదుమాటలు, గౌరవ వచనాలు, వలన మన మధ్య అన్యోన్యత కలగదు. మనము వారి దురుసు మాటలకు, తెలియకుండా చేసిన తప్పులకు స్పందించక మంత్రాన్ని జపించడమే ఉత్తమం.
మనమందరమూ క్షణికమైన జీవితంలో మన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఆంగ్లో సాక్సన్ హయాంలో ఎడ్విన్ అనే రాజుని చూడడానికి కొందరు క్రిస్టియన్ మత గురువులు ఆయన నివాసానికి వచ్చేరు. వారు ఆయనకు ఇలా బోధించేరు: "రాజా, మనము ఇక్కడ ఎగిరే పిచ్చుకల లాగా బ్రతుకుతున్నాం. ఎందుకనగా అవి బయట చలిలోనుండి ఎక్కడినుంచో వచ్చి, వంట గదిలోని ఆహారం ముక్కున పెట్టుకొని, మళ్ళీ బయట ఎక్కడికో ఎగిరి పోతాయి. అవి చీకటిలోనుంచి వచ్చి చీకటిలోకి తిరిగి వెళ్ళిపోతున్నాయి. పుట్టడానికి ముందు ఎక్కడి నుంచి వచ్చేమో, మరణం తరువాత ఎక్కడికి పోతున్నామో మాకు తెలీదు. మాకు తెలిసిందల్లా వెలుగుతో కూడిన ప్రస్తుత జన్మ."
గీత మనము పూర్ణములోనుంచి వచ్చి పూర్ణంలో కలిసిపోతున్నామని చెప్పింది. ఈ మధ్యకాలంలో మనము వ్యక్తమై ఉన్నాము. పరిమితమైన, మరణించేది అయిన జీవితం మనను మభ్యపెట్టి "నా వ్యక్తిత్వము పుట్టుకనుంచి, మరణించేవరకు 100 ఏళ్లు బ్రతుకుతుంది" అనేలా చేస్తుంది. కానీ గీత అవ్యక్తమని చెప్పడానికి కారణం మన జీవితం అపరిమితమైనది. జీసస్ క్రైస్ట్ మనల్ని భౌతిక విషయాలకు అతీతమై ఉండాలని బోధించేరు.
శ్రీకృష్ణుడు వాడిన మరో పదం అచిన్త్య. మన నిజస్వరూపమైన ఆత్మ ద్వంద్వాలకు అతీతమై ఉన్నది. అది తెలిసికోవాలంటే మనస్సును నిశ్చలం చేసికోవాలి. మనస్సు నిరంతరము ఆలోచనలతో నిండి ఉండేది. దురదృష్టవశాత్తూ ఈ రోజుల్లో "నా ఉనికి నా ఆలోచనల వలననే" అని చాలామంది నమ్ముతారు. యోగులు చెప్పేది దానికి వ్యతిరేకము. మనము ఆలోచనలను నియంత్రిస్తే మనకు ఉనికి లేదని తలుస్తాము. "నేనేమి చేసేది? నా సమయాన్ని ఎలా గడిపేది? నిద్రలో ఎటువంటి కలలు కంటాను?" అని ప్రశ్నించుకొని ఆవేదన చెందుతాము. వాటికి సమాధానం: మీరెందుకు కలలు కనాలని తలుస్తారు? ఎందుకు స్వార్థానికై, స్వలాభనికై ప్రయత్నిస్తారు? మనము పరోపకారం చేస్తూ, మనల్ని మర్చిపోతే, అదే నిజమైన జీవితమంటే.
నేను ధ్యానము మొదలుపెట్టిన రోజుల్లో కొందరు ఇలా అడిగేవారు: "నీకు మంచి వ్యక్తిత్వము౦ది. అలాగే మేధా సంపద ఉంది. నీవు వాటిని ఎందుకు వృధా చేస్తావు? ఎందుకు నీ మెదడుని మొద్దు బారేటట్లు చేసుకొంటావు? దానిని ఎందుకు నిశ్చలం చేయాలనుకొంటున్నావు?". కొందరికి మనకు వ్యక్తిత్వం లేదని చెప్తే ఆశ్చర్యం కలుగుతుంది. రమణ మహర్షి వంటి వారు మనం బ్రతికున్నామంటే ఒప్పుకోరు. యోగులు చెప్పేది: మన ముఖమును కప్పిపుచ్చే తెరను తీసివేస్తే గాని; భౌతిక-మానసిక వ్యక్తిత్వమనే తెరను దాటితే గాని, మనకు ఇతరులను ప్రేమించడం, మంచి కర్మలు చెయ్యడం, ఇతరులను సేవించడం వంటి సద్గుణాలు కలుగవు. 77
No comments:
Post a Comment