Bhagavat Gita
2.17
అథ చైనం నిత్యజాతం నిత్య వా మన్యసే మృతం
{2.26}
తథాపి త్వం మహాబాహో నైవ౦ శోచితు మర్హసి
అర్జునా! ఈ ఆత్మ నిత్యము పుట్టుచు, చచ్చుచు నుండు దానినిగ నీవు భావించినను, అట్టి స్థితిలో కూడ నీవు ఈ విధముగ దుఃఖి౦ప పనిలేదు
జాతస్య హి ధృవో మృత్యు ర్ధ్రువం జన్మ మృతస్య చ
{2.27}
తస్మా దపరిహార్యే అర్థే న త్వం శోచితు మర్హసి
జన్మించిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మమును తప్పదు. అనివార్యమగు ఈ విషయమున నీవు శోకించుట సరికాదు
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత
{2.28}
అవ్యక్త నిధనా న్యేవ తత్ర కా పరిదేవనా
అర్జునా! ప్రాణులు జన్మలకు ముందు తెలియుటలేదు. మధ్యలో తెలియుచున్నవి. గతించిన పిదప మరల గోచరించుట లేదు. ఈ విషయమై నీకు దుఃఖ మెందులకు?
శ్రీకృష్ణుడు శాశ్వతమైన ఆత్మ గురించి ఇచ్చిన వివరణ ఆలకించి ఇంకా ఇలాగ అనుకోవచ్చు: "నేను దేహిని. దేహం మరణిస్తే నేనూ మరణిస్తాను కదా." మనం మనల్ని దేహమనుకొన్నా, మరణానికి భయపడకూడదు, ఎందుకంటే దేహం సహజంగా కొన్నాళ్ళు౦డి పడిపోతుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు మనల్ని దేహం నుంచి విడదీసి చూపిస్తున్నాడు.
ధ్యాన మార్గంలో ఒకరి భౌతిక శరీర లక్షణాలను చూడక వారి అంతరంగాన్ని చూస్తాం. నన్ను ఫలానా వారు ఎంత పొడుగు అని అడిగితే నేను చెప్పలేను. అది ఒక మంచి చిహ్నం. అలాగే నన్ను ఒకరి వయస్సు ఎంత అని అడిగితే చెప్పలేను. మనమెప్పుడైతే ఒకరిని భౌతిక లక్షణాలతో లేదా వయస్సుతో ముడి పెట్టకుండా ఉంటే మనము వారిలోని ఆత్మను దర్శించినట్లే. మనము ఒకరి భౌతిక లక్షణాలు, వయస్సు గురించి ఆలోచిస్తే, దాని పర్యావసానము మన లక్షణాలను, వయస్సును విశ్లేషించడమే. యోగులు ఒకరి అంతర్గతం ఎలా ఉందో అలా చూస్తారు. నేను ఒకరి కళ్ళను చూస్తాను, ఎందుకంటే అవి వారి మనస్సు యొక్క కిటికీలు. తద్వారా భగవంతుని దర్శించవచ్చు. క్రమంగా ఆత్మ జ్ఞానం అలవరచుకొంటే మనం ఒకరి కళ్ళలో చూసి, వారిలో వసించే భగవంతుని ప్రేమ స్వరూపాన్ని చూస్తాం. 78
No comments:
Post a Comment