Bhagavat Gita
2.32
యదా తే మోహ కలిలం బుద్ధి ర్వ్యతి తరిష్యతి
{2.52}
తదా గన్తాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ
నీ బుద్ధి ఎప్పుడు మోహ కాలుష్యమును దాటివేయునో అప్పుడు నీవు వినవలసిన దానిని గూర్చియు, వినిన దానిని గూర్చియు వైరాగ్యమును పొందుదువు
శ్రుతివిప్రతి పన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా
{2.53}
సమాధావచలా బుద్ధి స్తదా యోగ మవాప్న్యసి
శ్రవణాదులచే విచలితమైన నీ బుద్ధి సమాధియందు ఎప్పుడు స్థిరముగ నుండునో అప్పుడు యోగమును పొందగలవు
ఇక్కడ శ్రీకృష్ణుడు ఇంద్రియాలోలత్వము వలన కలిగే మోహమును దాటితే పొందే సమాధిని గూర్చి చెప్పుచున్నాడు. ఇంద్రియాలు ఎన్నటికీ శాశ్వత సుఖము ఇవ్వలేవు. కేథలిక్ యోగులు దాన్నే "పవిత్రమైన అలక్ష్యం" (holy indifference) అంటారు. అంటే అన్ని స్థితులలోనూ మనస్సుని నిశ్చలంగా ఉంచడం. మనస్సు నిశ్చలంగా ఉంటే సమాధికి చేరువ అవ్వచ్చు. 103
No comments:
Post a Comment