Bhagavat Gita
2.44
ఇంద్రియాణా౦ హి చరతా౦ యన్మనో అను విధీయతే
{2.67}
త దస్య హరతి ప్రజ్ఞా౦ వాయు ర్నావ మివా౦భసి
నీటియందు గాలి నావను పెడదారి పట్టించునట్లు విషయాసక్తములైన ఇంద్రియముల ననుసరి౦చెడి మనస్సు మనుజుని వివేకమును హరించుచున్నవి
తస్మా ద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః
{2.68}
ఇంద్రియా ణీ౦ద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా
అర్జునా! ఎవడు తన ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి మరలించునో వాని బుద్ధి స్థిరమై యున్నది
ఈ శ్లోకాలు మానవాళికి ఇంద్రియాలను అదుపులో పెట్టుకోకపోతే అయ్యే గతి చెప్తున్నాయి. ఎవరైతే తృప్తి, భద్రత, ఇవ్వలేని ఇంద్రియాలకు దాసులవుతారో వారికి ముప్పు తప్పదు. కాబట్టి శ్రీకృష్ణుడు ఇంద్రియాల ప్రేరణను తగ్గించుకొని వాటిని అదుపులో పెట్టుకోవాలని బోధిస్తున్నాడు.
మన నాలుకకు, మనస్సుకు అవినాభావ సంబంధం ఉన్నది. గాంధీ మహాత్ముడు నాలుకను నియంత్రిస్తే, మనస్సు స్వాధీనంలో పెట్టుకోవచ్చునని చెప్పిరి. ఈ రోజుల్లో ప్రసార మాధ్యమాలు నోరూరించే తిండి మీద అనేకమైన ప్రకటనలు చేస్తున్నాయి. మనలో చాలామంది వాటిచే ప్రభావితులవుతున్నారు. మన నాలుకను వారు ప్రకటించే తిండినుంచి తప్పించి ఆరోగ్యకరమైన, పౌష్ఠికాహారానికి తినేలాగ చెయ్యాలి. అనేక శాస్త్రజ్ఞులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారం తినాలి అన్న అంశం మీద పరిశోధన చేస్తున్నారు. మొదట్లో నాలుకకు కొన్ని రుచులు సహించవు. కానీ మనము మన అలవాట్లను క్రమంగా సాత్త్వికంగా మార్చుకోవచ్చు. అలాగని నోరును పూర్తిగా కట్టేసుకోమని కాదు. మాంశాహారము నుండి శాఖాహారానికి క్రమంగా మారవచ్చు. మనము పుస్తకాల్లో ఎటువంటి ఆహారం మంచిదో, ఎటువంటి ఆహారం అపాయకరమో వాటిని గూర్చి చదువుతాం. వాటిలో మాంశాహారము విడిచేయవలసినదని ఘంటాపథంగా చెప్తున్నారు. మాంశాహారం వలన అనేక సమస్యలు వస్తాయి, ముఖ్యంగా గుండె జబ్బులు. శాస్త్రజ్ఞులు ప్రతివ్యక్తికి అనేకసార్లు సలహా ఇవ్వకపోయినా, క్రమంగా శాఖాహారమే దేహ, మానసిక స్వస్థతికి మంచిదని చెప్తున్నారు.
శాఖాహారము మన ఆరోగ్యాన్ని స్వస్థతతో ఉంచడమే కాకుండా, ఆధ్యాత్మిక పరంగా జీవైక్య సమానతకు దోహదం చేస్తుంది. మన ఆద్యాత్మికత గట్టి పడుతున్న కొద్దీ, జీవులయందు భూత దయ కలిగి, వాటిని హింసించ కూడదనే అవగాహనికి వస్తాము. శాఖాహారము ఈ విధంగా జీవైక్య సమానతను పెంపొందిస్తుంది.