Bhagavat Gita
2.8
న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః
{2.12}
న చైవ న భవిష్యామ స్సర్వే వయ మతః పరమ్
నేనును, నీవును, ఈ రాజులును ఒకప్పుడు లేనివారము కాము. భవిష్యత్తులో లేకుండా పోయే వారము కాము
అర్జునుని చూచి "నువ్వు ఎప్పుడూ ఉన్నావు. ఎప్పుడూ ఉంటావు" అని శ్రీకృష్ణుడు ధైర్యం ఇస్తున్నాడు. మనము ఎప్పటికీ ఉండేవాళ్ళము అనగా మన ఆత్మ శాశ్వతము. జీసస్ "నేను మీకు మరణములేని జీవితాన్ని ఇవ్వడానికి వచ్చేను" అని చెప్పెను. ధ్యానంలో మనము కాలాన్ని దాటి శాశ్వత సుఖాన్ని అనుభవిస్తాము.
కాలము ఒక నియంతలా వ్యవహరిస్తుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పరుగులు పెడుతూ ఒక ప్రదేశం నుంచి ఉంకో ప్రదేశానికి వెళ్తున్నారు. వైద్యుడిని కలవాలంటే వారు చెప్పే సమయానికి, అటు ఇటూ కాకుండా, వెళ్ళాలి. ఒకప్పుడు ఘంట తీసికొనే పని ఇప్పుడు కంప్యూటర్లతోనూ, అంతర్జాలం తోనూ నిమిషాలమీద చేస్తున్నాం. ఇలాగే కొన్నాళ్ళు౦టే ఒక అర్థ క్షణం ఆలస్యమయితే మనగురించి నిరీక్షించే వారు తెగ కోప్పడతారు.
కొందరు బస్ ఎక్కడానికి కొంచెం ఆలస్యంగా వస్తూ ఉంటారు. క్షణాలలో బస్సు వారిని ఎక్కించుకోకుండా కదిలిపోతుంది. అది బస్ నడిపేవాడి తప్పు కాదు. మనం ఉదయాన్నే లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, ధ్యానం చేసి, ఇంటినుంచి బయల దేరుతే మనం కాలుడితో పోటీ పడనక్కరలేదు. పని ఎంత వేగిరంగా చేసేమని కాదు చూడవలసినది. పని ఎంత సంపూర్ణతతో చేసేమో చూడాలి.
అలాగే నా ధ్యాన మందిరానికి వచ్చే కొందరు, ధ్యానం చేస్తూ మధ్యలో వాచీ చూసుకొంటూ ఉంటారు. అలాంటి వారికి ధ్యానం కొరకబడదు.
మనం చిరకాలం ఉండాలంటే మన ఇంద్రియాలతోనూ, దేహ౦తోనూ తాదాత్మ్యం చెందకూడదు. అలాగే ఆధ్యాత్మిక జీవనం అవలంబిస్తే చెడు అలవాట్లు -- ధూమ పానం, మద్యం, అతిగా తినడం వంటివి -- వదులుకోవాలి. ఇది నైతిక విలువలకి సంబంధించినది కాదు. నేను చెప్పేది దేహేంద్రియాల్ని ఒక యంత్రంగా పరిగణించే శాస్త్రం. మన మెంతకాలం దేహేంద్రియాలతో ఏకమై, అనుబంధాలను భౌతిక పరమైన విషయాలకే పరిమితం చేస్తే, మనకంతకాలం ఆత్మ జ్ఞానము కలుగదు. 61
No comments:
Post a Comment