Bhagavat Gita
3.1
అర్జున ఉవాచ
జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధి ర్జనార్థన
{3.1}
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ
జనార్థనా! కర్మకంటెను జ్ఞానమే శ్రేష్ఠమని నీ అభిప్రాయ మగునేని, ఓ కేశవా! నన్నీ భయంకరమైన కర్మయందు ఎందులకు నియమించుచున్నావు?
వ్యామిశ్రే ణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే
{3.2}
త దేకం వద నిశ్చిత్య యేన శ్రేయో అహ మాప్నుయామ్
మిశ్రమ వాక్యముల చేత నా మదిని కలత పెట్టుచున్నావు. అందుచేత నేను దేనిచేత శ్రేయమును పొందుదునో అట్టి దానిని నాకు నిశ్చయించి చెప్పుము
అర్జునడు శ్రీకృష్ణుని జనార్ధన (అనగా జనులను ఉత్తేజ పరుచువాడు) అని సంబోధించి ఇలా పలికెను: నీవు ఆధ్యాత్మిక జీవనం ఆత్మ జ్ఞానానికి ఉత్తమమైన మార్గమని చెప్పితివి. అయితే నా కోర్కెలును నియంత్రించి, ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకోమని ఎందుకు చెప్పుచున్నావు? నాకు ఆధ్యాత్మిక జీవన మార్గమును బోధించి ఇంద్రియ విషయాలను ప్రక్కన పెట్టు. ఆత్మ గురించి వివరించు. నేను ఇంద్రియములకే పరిమితము కాదని తెలిసికొన్నాను.
అర్జునడు జ్ఞానం మరియు కర్మ వేర్వేరు మార్గాలని అనుకొంటున్నాడు. సెయింట్ ఫ్రాన్సిస్ మన కర్మ ఎంత లోతో మన జ్ఞానము కూడా అంతే లోతు అని చెప్పెను. జ్ఞానానికి, పట్టుదలకి సంబంధం లేకపోవచ్చు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం మన కర్మలలో విదితమౌతుంది.
అర్జునుడు బుద్ధిని ఉపయోగించి శ్రీకృష్ణుని బోధను అర్థము చేసికొనడానికి ప్రయత్నిస్తున్నాడు. బుద్ధి ప్రతి విషయాన్ని విభజన చేసేది. దాని పని విభజించడం, సంవర్గం చేయడం. అది దానికున్న సహజ లక్షణం. అది ఒక విశేషాన్ని సంపూర్ణంగా చూడక, విడివిడి భాగాలను మాత్రమే చూస్తుంది. దీనివలన ఆధ్యాత్మిక సాధనలో అనేక సమస్యలు వస్తాయి. శ్రీ రామకృష్ణని "దేవుడు వ్యక్తిగతమా, కాదా?" అని ఒకరు అడిగేరు. దానికి ఆయన సమాధానం రెండూ అని. ఆది శంకరుడు మొదట "దేవుడు రెండూ" అని, అటు తర్వాత "రెండూ తప్పే" అనేవారు.
అర్జునుడు ఇలా ఆలోచిస్తున్నాడు: "ఒకరు నాతో శ్రీకృష్ణుని మాటలు స్థిరంగా ఉండవని చెప్తే నేనే నమ్మేవాడిని కాను. కానీ ఇప్పుడు నేను వైరుధ్యం చూస్తున్నాను. ఇది దేవునికి తగని లక్షణము". బుద్ధిం మోహయసీ వ మే: నా బుర్ర తిరిగుతున్నాది. నేను గత 18 శ్లోకాలు విన్నాను. వాటిని వినేముందు నేనెవర్నో నాకు తెలుసు. కానీ ఇప్పుడు నీవెవరో, నేనెవరో తెలియటంలేదు. " నిశ్చిత్య అనగా --" సరిగ్గా ఆలోచించు. ఊహాతీతమైన జ్ఞానంతో మాట్లాడవద్దు. నాకు ఒకే ఒక కర్తవ్యం బోధించు. స్థిరముగా ఉండు." అర్జునుడు స్థిరమైన మార్గదర్శకత్వం కోరుతున్నాడు. లేకపోతే మనలాగే అతడూ దిగ్భ్రమ చెందుతాడు.
ఈ తబ్బిబ్బు ఆధ్యాత్మిక జీవనం మొదట్లో కలుగుతుంది. ధ్యానం చేస్తే అతీతమైన శక్తి కలుగుతుంది. దీన్నే ప్రజ్ఞ అంటారు. అంటే దృఖు, దృశ్యం, ద్రష్ట అనే త్రిపుటి ఉండదు. ధ్యానంతో మనకున్నా సమస్యల్లో చాలామటుకు పరిష్కరించుకోగలం. ధ్యానం వలన మన కష్టాలకి కారణాన్ని విశ్లేషించకుండా, వాటిపై కేంద్రీకరించక, వాటి గురించి మాట్లాడక ఉంటాము. కొన్నేళ్ళు ధ్యానం అలవాటు చేసికొంటే మనల్ని నిద్రలో కలత పరిచే భౌతిక లేదా మానసిక సమస్యలు వీడి పోతాయి. అటు తరువాత అహంకారాన్ని వీడి సమస్త దుఃఖాలను పోగొట్టుకుంటాము.