Bhagavat Gita
3.2
శ్రీ భగవానువాచ:
{3.3}
లోకే అస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా అనఘ
జ్ఞానయోగేన సా౦ఖ్యానాం కర్మయోగేన యోగినామ్
అర్జునా! ఈ లోకమునందు సా౦ఖ్యులకు జ్ఞాన యోగము, యోగులకు కర్మ యోగము అను రెంటిని మొదట నేనే చెప్పియుంటిని.
పూర్వ కాలంలో పర్యావరణం శుద్ధంగా ఉండి, పోటీ తక్కువగా ఉండి, జీవితం సులభంగా సాగిపోతున్నప్పుడు, దేవుడు ఆత్మ జ్ఞాననికై రెండు మార్గాలు బోధించేడు. ఎవరైతే అందరితో కలిసి మెలిసి, జీవైక్యత నెరిగి, నిజానికి, మిథ్యకి మధ్యనున్న బేధం తెలిసి ఉన్నారో వారికి జ్ఞాన మార్గం సూచించేడు. అర్జునుడు వీరుడు కాబట్టి శ్రీకృష్ణుడు వానికి కర్మ యోగము సూచించెను. నేటి కాలంలో పోటీ ఎక్కువై, ప్రసార మాధ్యమాల వలన ప్రభావితమై, జ్ఞాన యోగం పాటించడం మిక్కిలి కష్టమైంది. శ్రీ రమణ మహర్షి లాంటి వారికి మాత్రమే అది సాధ్యం. కర్మ యోగం కూడా కష్టమే. కానీ మన చుట్టూ కష్టాలతో కూడిన మనుష్యులను చూస్తూ ఉన్నప్పుడు, వారి కష్టాలను గట్టెక్కించడానికి నిస్వార్థ సేవ చెయ్యాలి.
యోగులు చెప్పేది: బహిర్ముఖులు ఎక్కువ ధ్యానం చెయ్యాలి; అంతర్ముఖులు ఎక్కువ కర్మ చెయ్యాలి. కొన్ని రోజులు మనం కర్మ చెయ్యడానికి విముఖతతో ఉంటాము. అలా౦టప్పుడు ధ్యానం చేయాలనుకొంటాం. కొన్ని గంటలు ధ్యానం చేసి తిరిగి కర్మ చెయ్యడమే ఉత్తమం. కఠోర పరిశ్రమ చేస్తే మనస్సు బాహ్యంగా ప్రసరించి మనలను స్వస్థతతో, ఆనందంతో, నిస్వార్థంతో, ఆధ్యాత్మికతతో ఉంచుతుంది. అది ఎక్కువగా యువకులకు పనికివస్తుంది. వారిలో ఒత్తిడి లేకపోతే, డబ్బుకై, ప్రతిష్ఠలకై ఆశ లేకపోతే, వారిలోని ఉద్రిక్తత తగ్గుతుంది.
కొందరు కర్మలు సదా చేస్తూ ఉంటారు. వాళ్ళ పనులన్నీ పూర్తి చేసి, ఇంకా నిద్ర పోవడానికి సమయం ఉంటే అసంతృప్తితో ఉంటారు. అటువంటి కర్మను శ్రీకృష్ణుడు హర్షించడు. ఎవరైతే సదా కర్మలు చేస్తూ ఉంటారో, కర్మలు చేయడానికై నిర్బంధించుకుంటారో, తమ కర్మలని ప్రక్కకు పెట్టలేరో, వారికి ధ్యానమెంతో అవసరం.
ఎప్పుడైతే బద్దకం ఆవహిస్తుందో, అప్పుడు కర్మ చెయ్యడం ఉత్తమం. తమస్ ను రజస్ తోనే ఎదిరించాలి. అదే రజస్ ఎక్కువైతే తమస్ తో కాక, సత్త్వ గుణంతో ఎదుర్కోవాలి. దీనికి కొంత స్వీయజ్ఞానం అవసరం. అలాగే ఇష్టాయిష్టాలనుండి స్వతంత్రంగా ఉండాలి.