Bhagavat Gita
3.11
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మో అక్షర సముద్భవమ్
{3.15}
తస్మా త్సర్వ గతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్
వేదము నుండి కర్మ జనించినది. వేదము పరమాత్మ నుండి ఆవిర్భవించినది. కనుక సర్వగతమైన బ్రహ్మము ఎల్లప్పుడు యజ్ఞమునందు ప్రతిష్ఠితమై యున్నాడని గ్రహింపుము
మనం బ్రాహ్మణులనిపించుకోవడానికి జంధ్యం వేసికోనక్కరలేదు లేదా బాహ్య శుద్ధి మాత్రమే చేసికోనక్కరలేదు. ఎవరైతే తమలోని బ్రహ్మన్ ని తెలిసికోవాలని ప్రయత్నిస్తాడో అతడే బ్రాహ్మణుడు. బ్రాహ్మణులను ద్విజ అనికూడా అంటారు. ద్విజుడు అంటే రెండుమార్లు పుట్టినవాడు. సంప్రదాయం ప్రకారం మొదటి పుట్టుక తల్లి గర్భం నుంచి ఆవిర్భవిస్తుంది. ఇది భౌతికమైనది. రెండవ పుట్టుక అహంకారం తుడిచి వేసినప్పుడు కలుగుతుంది. మనమనుకోవచ్చు స్వార్థం, వేర్పాటు, కోర్కెలు పోగొట్టుకుంటే దహన సంస్కారాలు అవసరమా అని. అట్టివాని దహనం భాజాభజంత్రీలతో, హరేరామ నినాదాలతో, పూల వానతో చెయ్యాలి. ఎందుకంటే తన అహంకారాన్ని చంపుకొని అతడు తక్కిన వారందరికీ ఎనలేని సేవ చేసేడు. వాని జీవితం ఎలా ఉన్నా, మనకది ఆదర్శప్రాయమై, స్పూర్తినిస్తుంది. అదే మన జన్మ యొక్క పరాకాష్ఠ. మైస్టర్ ఎక్హార్ట్ రెండవ పుట్టుకను "గొప్ప అతలాకుతలం" అంటారు; ఎందుకంటే ప్రతి అవరోధాన్నీ దాటగలిగే ఓర్పు, ఆత్మార్పణ అవసరం.
అహంకారాన్ని చంపుకోవాలనే కోర్కె, దానికి కావలసిన దక్షత భగవంతుని ప్రసాదం. మనలో చాలామంది సామాన్యమైన బడుగు జీవితం గడుపుతారు. అట్టివారలని భగవంతుడు కరుణిస్తే మనకు ఆశ్చర్యం కలుగక మానదు. నేను అనేకమార్లు ఉదయాన్నే నిద్ర లేచి "నాకంటే తక్కువ ఎవడైనా నిన్ను పొందడానికి అర్హుడా?" అని అనేవాడిని. చివరకు అణకువతో, భగవంతుని కరుణకు పాత్రుడనై, జీవితంలో ఎంతో ఆనందం పొందేను.