Bhagavat Gita
3.12
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయ తీహ యః
{3.16}
అఘాయ రి౦ద్రియారామో మోఘం పార్థ స జీవతి
పార్థా! ఈ విధముగా నియమింపబడిన జగచ్చక్రమును అనుసరించని వాడు ఇంద్రియలోలుడై పాపజీవనమును గడుపుచున్నాడు.
భగవంతుడు మన దేహంలోని ప్రతి అణువులో నిస్వార్థత నిక్షిప్త పరచేడు. దాన్నే బుద్ధుడు ధర్మ అంటాడు. మానవుని యొక్క ధర్మము: క్రోధాన్ని దయగా, ద్వేషాన్ని ప్రేమగా మార్చుకోవడం. యోగులు చెప్పేది: ఎవరైతే తమ సౌఖ్యం కొరకే జీవితం గడుపుతారో వారు మరణిస్తారు; కానీ ఎవరైతే ఇతరుల కొరకై జీవిస్తారో వారు ఆనందంతో, సంపూర్ణంగా ఉంటారు. "కన్నుకి కన్ను, పన్నుకి పన్ను" అనే హింసావాదం చెప్పడానికి సులభమే. కానీ మనస్సు క్రోధంతో నిండి ఉంటే దాని నిశ్చలం చేసికోవడానికి అమితమైన ధైర్యం, సహనం కావాలి.
మనమెంత అహంకారాన్ని నియాంత్రిస్తామో అంత ఎక్కువగా ఆత్మ జ్ఞానాన్ని, ప్రేమని పొందుతాము. మనము స్వార్థానికై -- కోర్కెలు, అమిత లాభం, పేరుప్రతిష్ఠ -- ఒక ముసుగు వేసికొన్నాము. దాన్ని తీసేయాలంటే మనస్సును నిర్మలం చేసికొని దేవుని ఆరాధించాలి. మంత్ర జపాన్ని తరచు చేస్తూ ఉంటే మనలో క్రోధము లేదా భయము కలిగితే, మంత్రాన్ని జపిస్తూ, వేర్పాటు లేకుండా ఇతరులతో దగ్గరవడానికి ప్రయత్నిస్తే మన ముసుగు క్రమంగా తీయబడుతుంది. తద్వారా ఎనలేని ఆనందం అనుభవిస్తాము.
శ్రీకృష్ణుడు తన మురళిని వాయిస్తూ ఉంటే రాధ అసూయతో "నువ్వు గంటల తరబడి వాయించే మురళి నీ పెదవులను తాకి ఉండడానికి చేసిన పుణ్యమేమిటి?" అని అడిగింది. శ్రీకృష్ణుడు మురళిని రాధకు చూపి "చూడు దీనిలో అంతా ఖాళీ. కాబట్టి నా వాయిద్యం చాలా సులువవుతుంది" అని అన్నాడు. మనం కూడా స్వార్థ పూరిత కర్మలు, వేర్పాటు త్యజిస్తే మనలో ఖాళీ ఏర్పడి, దాన్ని దేవుని ప్రేమతో, ఆనందంగా నింపవచ్చు.