Bhagavat Gita
3.13
యస్త్వాత్మరతి రేవ స్యా దాత్మ తృప్తశ్చ మానవః
{3.17}
ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే
ఆత్మయందే రమించుచు, ఆత్మయందే తృప్తిచెందుచు, ఆత్మయందే ఆనందించు వానికి చేయదగిన కార్య మేదియును లేదు
నైవ తస్య కృతే నార్థో నాకృతే నేహ కశ్చన
{3.18}
న చాస్య సర్వభూతేషు కశ్చి దర్థ వ్యపాశ్రయః
ఈ లోకమున కర్మ లాచరించుట వలన వానికి ప్రయోజనము లేదు. ఆచరింపనిచో దోషము ప్రాప్తించదు. సర్వ ప్రాణులయందును అతనికి ప్రయోజన రూపమైన దేదియును లేదు
మనం లాభం లేదా పేరుప్రతిష్ఠలకై బ్రతికినంత కాలము స్వతంత్రత అనుభవించలేము. గాంధీ మహాత్ముడు విసుగు విరామం లేకుండా రోజూ 15 గంటలు పనిచేసేవారు. సత్యాగ్రహ దశలో ఆయనను నమ్మి ఎందరో ఆయన అనుచరులయ్యారు. వారి బాగోగులు చూడడం ఆయన బాధ్యత. ఆయన స్వంతంత్రంగా పనిచేయడానికి కారణం నిస్వార్థ సేవ. గీత చెప్పేది, స్వార్థంతో చేసే ప్రతి పనీ, ఎంత చిన్నదైనా, కళ౦కమైనది. గాంధీ అడుగుజాడల్లో నడవాలంటే ఇతరులకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి మనకు గౌరవం, ప్రతిష్ఠ కలుగుతుందనే ఆశపడక పని చెయ్యాలి.
మనకు బాహ్య వస్తువుపై కోర్కె ఉన్నంత కాలం మన చేతన మనస్సులో అగాథమున్నది. ఒకడు తనవద్ద కోట్ల సొమ్ము ఉంటే ఆనందపడగలనని అనుకుంటే, వాడు దివాలా తియ్యడానికై ఉన్నాడు. అలాగే ప్రధాన మంత్రి అవ్వాలనుకునేవాడు తన మనస్సులోని ఆగాథాన్ని వ్యక్త పరుస్తున్నాడు. మనము ఒకరు లేదా ఒకటి ఉంటే ఆనందంగా ఉంటామని అనుకుంటే, మనము ఇతరులను మభ్య పెట్టడం లేదా అచేతనంగా మన ప్రియమైన బంధుమిత్రులను మోసం చెయ్యడమే. శ్రీకృష్ణుడు చెప్పింది: మీరు స్వతంత్రంగా కర్మ చెయ్యాలనుకుంటే, అహంకారం, వేర్పాటు తొలగించుకోవడానికి తీవ్రమైన ఆధ్యాత్మిక సాధన చెయ్యండి.