Bhagavat Gita
3.31
తస్మా త్త్వ మి౦ద్రియా ణ్యాదౌ నియమ్య భరతర్షభ
{3.41}
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనమ్
ఓ భారతా! కనుక నీవు మొదట ఇంద్రియములను నియమించి, జ్ఞాన విజ్ఞానములను నాశనము చేయు ఈ కామ మనెడి పాపిని త్యజింపుము
మనం కామాన్ని వదలించుకోవాలంటే ఇంద్రియాలను, ముఖ్యంగా నాలుకను, అదుపులో పెట్టుకోవాలి. ఇది ఒక కుక్క పిల్లను పెంచి, తర్ఫీదు ఇచ్చినట్లే. నేను ఒకమారు కొలను చుట్టూ నడుస్తూ ఉంటే, ఒకావిడ తన పెంపుడు కుక్కతో నడుస్తూ, అది చెప్పినమాట విననప్పుడు దూషిస్తూ ఉన్నది. కానీ సర్కస్ లో కుక్కలతో ప్రదర్శన చూసినప్పుడు, వాటికి తర్ఫీదు ఇచ్చే బాలిక, అవి సరిగ్గా మాట వింటే వాటిని పొగిడి, ముద్దు పెట్టుకొనేది. ఇదే విధంగా మన ఇంద్రియాలకు క్రమక్రమంగా తర్ఫీదు ఇచ్చి, మనము పూర్తిగా నిరాడంబరముగా కాక, పూర్తిగా ఆడంబరముగా కాక మధ్యలో ఉండవచ్చు.
శ్రీకృష్ణుడు, అర్జునుని నెపంతో, మనకు స్వలాభము, స్వీయ ఆనందము, పేరుప్రతిష్ఠలకు దురాశతో ప్రవర్తించ వద్దని బోధిస్తున్నాడు. అది మన బద్ద శత్రువు. ఎందుకంటే మనల్ని ఉల్లాసంగా, భద్రతతో ఉంచక జ్ఞాన సంపాదనకి ప్రతిబంధక మవుతుంది.
రామాయణంలో శ్రీరామునికి, రావణాసురుడుకి మద్య జరిగిన భీకర యుద్ధం మన మనస్సులో జరిగే అలజడికి తార్కాణం. "నాది, నేను" అనే భావనలను విసర్జించి, దేవుని పొందడానికి ప్రయత్నించాలి. దైనింద జీవితంలో మనము ఇతరులను ముఖ్యులుగా తలచి, వారి ఆనందాన్ని పెంపొందించాలి. 209
No comments:
Post a Comment