Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 3 Section 32

Bhagavat Gita

3.32

ఇంద్రియాణి పరాణ్యాహు రి౦ద్రియేభ్య పరం మనః {3.42}

మానసస్తు పరా బుద్ధి ర్యో బుద్ధేః పరతస్తు సః

దేహము కంటెను ఇంద్రియములు గొప్పవి. ఇంద్రియముల కంటెను మనస్సు గొప్పది. మనస్సు కంటెను బుద్ధి గొప్పది. బుద్ధి కంటెను ఆత్మ శ్రేష్ఠమైనది

మనలో చెలరేగుతున్న ఇంద్రియాలను ఆత్మతో అనుసంధానము ధ్యానం ద్వారా చెయ్యవచ్చు. మన దేహానికి తగినంత ఆహారము, వ్యాయామము ఇచ్చి స్వాధీనంలో పెట్టుకోవచ్చు. అలాగే ఇంద్రియాలను విచక్షణా జ్ఞానంతో నిగ్రహించాలి. గీత మనలను విషపూరితం చేసేది మన నాలుకతో పాటు కళ్ళు, చెవులు కూడా అని చెప్తుంది. ఈ నేపధ్యంలో మన పిల్లలకు ఏ సినిమాలు చూడాలో, ఏ టివి కార్యక్రమాలు చూడాలో, ఏ పుస్తకాలు చదవాలో చెప్పాలి. వాళ్ళకు స్వతహాగా వాటి గురించి తెలీదు. పెద్దయ్యేక వారి నిర్ణయాలు వారే చేసుకొంటారు.

ఎలాగైతే దేహానికి, ఇంద్రియాలకు ఆత్మతో అనుసంధాన దిశగా నేర్పుతామో, మనస్సు, బుద్ధులకు కూడా అలాగే నేర్పవచ్చు. మన మనస్సులోని నిరాశతో కూడిన భావాలను, ద్వేషాన్ని వదిలించుకొనే దిశలో ప్రయత్నించాలి. బుద్ధికి మనం నేర్ప వలసింది మన స్థిర భావాల గురించి వైరాగ్యం. శాస్త్రజ్ఞానాన్ని పొందాలన్నా మన౦ బుద్ధితో తాదాత్మ్యం చెందకూడదు.

మనము మన తలిదండ్రులను ఎలా ఆదరిస్తామో, పిల్లలు కూడా మనం వృద్ధులు అయినప్పుడు అలాగే ఆదరిస్తారు. మనము విప్లవకారులుగా, ఉంటే, మన మనుమలు "అదిగో సంఘ సంస్కర్త వస్తున్నాడు" అని వెటకారం చేస్తారు. ఎవరైతే స్థిర భావాలతో ఉంటారో, కాల క్రమేణా ప్రత్యర్థుల భావాలను కూడా పట్టుకొని వేలాడుతారు. కొందరు వృద్ధాప్యంలో తమ విప్లవ భావాలను వదిలి ప్రతికూలంగా మారుతారు. కానీ మనకు ప్రత్యర్థుల యందు గౌరవము౦టే, కాలం, పరిస్థితులు ఎంత ప్రభావితం చేసినా, సహనంతో ఉంటాము. మన మనుమలు చెప్పేది విని, వారు చెప్పినదానిలో సత్యము౦టే వారితో ఏకీభవించాలి.

మన ప్రత్యర్థులు చెప్పేది గౌరవంతో, ప్రేమతో వినగలిగితే మనమే సమస్యనైనా పరిష్కరించవచ్చు. గాంధీజీ ప్రత్యర్థులతో సంభాషణ చెయ్యడంలో ప్రావీణ్యత గలవారు. ఒక ప్రత్యర్థి ఆయన చెప్పే ప్రతి మాటను ఖండించేవాడు. అతను గాంధీజీ చెప్పిన ప్రతి పరిష్కారంలోని లోపాలు ఎత్తి చూపేవాడు. కానీ గాంధీజీ ఆయనయందు ప్రేమతో. గౌరవముతో నుండి తన దృక్పథాన్ని స్పష్టంగా వివరించేవారు. 211

No comments:

Post a Comment

Viveka Sloka 31 Tel Eng

Telugu English All ఏతయోర్మందతా యత్ర విరక్తత్వముముక్షయోః । మరౌ సలిలవత్తత్ర శమాదేర్భానమాత్రతా ॥ 31 ॥ యత్ర = ఎచట (ఏ వ్యక్త...