Bhagavat Gita
3.33
ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మాన మాత్మనా
{3.43}
జహి శత్రు౦ మహాబాహో కామరూపం దురాసదమ్
అర్జునా! ఈ విధముగ బుద్ధికంటెను శ్రేష్ఠమైన ఆత్మను తెలిసికొని, బుద్ధి చేత దేహేంద్రియ మనస్సులను నిగ్రహించి జయించుటకు సాధ్యము కాని కామమనెడి శత్రువును సంహరింపుము
మన ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు ఆత్మతో అనుసంధానము కాకపోతే మనలో అలజడి, విచారము కలుగుతాయి. ఎన్నటికీ ఆనందం కలుగదు. ధ్యానం ఈ విషయంలో చాలా ఉపయోగపడుతుంది. ధ్యాన౦లో విడుదలయ్యే శక్తితో ఇంద్రియాలు, మనస్సు, బుద్ధులకు అతీతంగా మారవచ్చు.
దానికై గాంధీజీ చెప్పినట్టు ఒక గిన్నెతో సముద్రాన్ని ఖాళీ చేసేంత ఓపిక మనకుండాలి. కానీ ప్రతి యుగంలోనూ, ప్రతి దేశంలోనూ అతి కొద్ది సాధనతో నిస్వార్థులుగా మారే మహానుభావులు౦టారు. వారు మా ధ్యాన మందిరం లాంటి వారు. మొదట్లో మా ధ్యాన మందిరం యొక్క కప్పును మాత్రమే మార్చాలని అనుకున్నాము. కానీ అధికారులు తనిఖీ చేసి దాని పునాదిని కూడా మార్చాలని చెప్పేరు. దానికై ఎన్నో పనిముట్లతో, ఎంతో శ్రమతో పని చెయ్యవలసి వచ్చింది. అలాగే మనలో చాలామంది తమ పునాదిని --అనగా స్వలాభము, సుఖములు, పేరు ప్రతిష్ఠలకై ప్రాకులాట --పూర్తిగా మార్చుకోవాలి.
ధ్యానం గాఢమైనప్పుడు మనము అహంకారము ఒక పెద్ద లంపటమని తెలుసుకొంటాము. మనకందరికీ తెలిసిన విషయం: ఎప్పుడూ తమ గురించే మాట్లాడేవాళ్ళకు దూరంగా ఉండాలని. మన స్వార్థం వలన మనకు తప్ప వేరే వారికి ఉపయోగం లేదు. మన అహంకారం కూడా అంతే. మన గత చరిత్ర ఎలాగ ఉన్నా, అహంకారాన్ని నిర్మూలించుకుంటే, మనము జ్ఞానంతో, సహనంతో, ఓర్పుతో ఇతరులకు సేవ చెయ్యగలం.
ఈ అధ్యాయాన్ని శ్రీకృష్ణుడు ఇలాగ అంతం చేస్తున్నాడు: "నీలో స్వార్థాన్ని జయించు. అహంకారాన్ని నిర్మూలించు." ఇదే నిర్వాణమంటే . అలా చేస్తే ఆత్మ జ్ఞానము కలిగి, జీవైక్య సమానతను తెలుసుకొంటాం 212
No comments:
Post a Comment