Bhagavat Gita
3.5
య స్త్వి౦ద్రియాణి మనసా నియ మ్యారభతే అర్జున
{3.7}
కర్మే౦ద్రియైః కర్మయోగ మసక్త స్స విశిష్యతే
అర్జునా! జ్ఞానే౦ద్రియములను మనసుతో నియమించి ఫలాశక్తి లేనివాడై, కర్మే౦ద్రియముల ద్వారా కర్మయోగము నాచరించువాడు శ్రేష్ఠుడగుచున్నాడు
నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః
{3.8}
శరీర యాత్రాపి చ తే న ప్రసిద్ధ్యే దకర్మణః
నీవు నియమితకర్మము నాచరింపుము. కర్మ మానుట కన్నా చేయుటయే మేలు కదా! కర్మ చేయని వానికి జీవనయాత్ర కూడా జరుగదు
గాంధీ మహాత్మునికి వేప చెట్టు వ్యాధుల నుండి ఉపశమనం ఇస్తుందని తెలిసి, వేప ఆకుల పచ్చడిని తినేవారట. ఎందుకంటే జీవితంలో మనకు చేదు అనుభవాలు వస్తాయి. అప్పుడు కూడా స్థిరంగా, ఆహ్లాదంగా ఉండగలగాలి. మన బంధుమిత్రులు దూషిస్తే మనమెంతో కలత చెందుతా౦. వారి దూషణ వేప పచ్చడివలె అరిగించుకోవాలి. మొదట్లో అది చేదు అనుభవం ఇవ్వచ్చు. వేప సూక్ష్మ క్రిములను ఎలా నిర్మూలిస్తుందో, మనలోని స్వార్థం, క్రోధం, భయం అలా నిర్మూలించ బడతాయి. నిస్వార్థంతో బ్రతికితే, అది ఎంత కష్టమైనప్పటికీ, మనం సుఖాలనే కాక దుఃఖాలనూ సంతోషంగా స్వీకరిస్తాము.
కర్మ ఎంతో అవసరం. నా అమ్మమ్మ "దేవుడు నీకు నోరు ఇచ్చేడు. అలాగే రెండు చేతులు ఇచ్చి వాటి ద్వారా ఆహారం భుజించమన్నాడు" అనేది. మన చేతులను ఇతరులను మభ్యపెట్టడానికి లేదా హింసించడానికి కాక మనకు, ఇతరులకు మేలు చెయ్యడానికి ఉపయోగించాలి.
పరులను సేవించుటకై ఆహారం, వ్యాయామం, కర్మలు పవిత్రమైనవి. అలాగే ఎక్కువగా తిని, తగినంత వ్యాయామం చేయక ఉన్నవారు నిస్వార్థమైన సేవ గూర్చి తెలిసికోలేరు. ఆధ్యాత్మిక జీవనానికి ఆరోగ్యం ఎంతో అవసరం.
శ్రీకృష్ణుడు అర్జునునికి కర్మలు చేయకపోవడం కన్నా, కర్మాచారణమే మేలని చెప్పుచున్నాడు. యుగాల క్రిందట మనము బహుశా రాళ్ళలా ఉండేవారమేమో. అప్పుడు కర్మ చెయ్యక పోయినా ఫరవాలేదు. కానీ ఇప్పటి మానవ దృక్పథంలో కర్మ చెయ్యకపోవడం మంచిది కాదు. బైబిల్ మన ఆహారాన్ని చెమటోడ్చి సంపాదించాలని చెప్తుంది. సాధన మొదలులో పరిశ్రమ ఎంతో ఉపయోగకరం. అది మన దేహాభిమానాన్ని తగ్గిస్తుంది. అధిక లాభానికై, పేరు ప్రతిష్ఠలకై కాక పని చేస్తే ఎంతో ఉత్తమం.
మనము కర్మల ద్వారా కుటుంబానికి, సమాజానికి ఎంత ఉపయోగపడుతున్నామని ప్రశ్నించుకోవాలి. మనకో ఎన్నిక ఉ౦ది: స్వార్థంతో కర్మలు చేసి ఆనందం, లాభం, నిరాశ, అభద్రతలు కావాలా లేదా ఇతరుల మేలుకొరకై పని చేసి ఆరోగ్యం, భద్రత, జ్ఞానం పొందాలా. స్వార్థ పూరిత జీవితం మన దేహం, ఇంద్రియాలు పనిచేస్తున్నంతవరకే. అదే నిస్వార్థంతో చేసే కర్మ, ఎన్నటికీ తరిగి పోదు. అందుకే గాంధీ మహాత్ములవంటివారు ఎన్నటికీ మరణించరు. ఆయన దేహం పడిపోయింది కానీ ఆయన ఆత్మ అహింసావాదు లందరికీ చిరస్మరణీయ మయ్యింది