Bhagavat Gita
3.6
యజ్ఞార్థా త్కర్మణో అన్యత్ర లోకో అయం కర్మబంధనః
{3.9}
తదర్థ౦ కర్మ కౌ౦తేయ ముక్తసంగ స్సమాచర
కుంతికుమారా! యజ్ఞార్థమగు కర్మములు తప్ప వేరు కర్మలన్నియు బంధములకు హేతువగు చున్నవి. కనుక ఫలాసక్తి లేనివాడవై యజ్ఞము కొరకు కర్మ నాచరింపుము
శ్రీకృష్ణుడు అయం కర్మ బంధనః --అనగా ప్రపంచమంతా కర్మచేత బంధించబడినది--అని చెప్తున్నాడు. మనం అది నమ్మక పేరుప్రతిష్ఠలకై, ఆనందానికై ప్రాకులాడి మనం స్వతంత్రులమని అనుకొంటాం. మనము అలాగ ఎంత ప్రాకులాడితే అంత ఇతరులకు సేవ చేయలేం. కొందరు స్వార్థ పూరిత, అహంకార పూరిత జీవితాన్ని గడుపుతారు. కొన్నాళ్ళు ధనం, వస్తువులు, సుఖాలు మొదలైనవి అనుభవించిన తరువాత దేవుడు అవి మన లక్ష్యం కాదని గ్రహించమంటాడు.
శ్రీకృష్ణుడు నిస్వార్థ కర్మను యజ్ఞం అంటాడు. మనము ఒకరికై సమయ౦, ధన౦, కౌశల్యం లేదా భూమి ఇచ్చి సహాయం చెయ్యచ్చు. ఒక మంచి కర్మకై స్వార్థ రహితంగా పాటుపడితే అది కూడా యజ్ఞమే. శ్రీకృష్ణుడు ముక్త సంఘ సమాచర అంటాడు -- అనగా మన కర్మలతో తాదాత్మ్యం చెందకుండుట. అలాకాక పోతే మన విచక్షణా జ్ఞానం కోల్పోయి, మన జీవిత లక్ష్యాన్ని మరిచిపోతాం. ఉదాహరణకు కొందరు ఆఫీసులో పనిచేసి, ఇంటికొచ్చి అదే పని చేస్తారు. అది ఉత్తమం కాదు.
మనకు ఇష్టమైన పని చెయ్యడం సులువు. కానీ మనకిష్టం లేని పని చెయ్యడం ఆధ్యాత్మిక జీవనంలో ఒక భాగం. జీవితంలోని ఒక సిద్ధాంతం: ఇష్టంలేని పనిచేస్తే, క్రమక్రమంగా ఇష్టమైన పని వస్తు౦ది; కానీ పని ఇష్టం లేదని వదిలేస్తే, వచ్చే మరో పని దానికన్నా నాశి రకమవుతుంది. గాంధీజీ "రుచి మనస్సులో ఉంది" అనేవారు. నేను చెప్తున్నది పని చేయడంలోని అభిరుచి మనస్సులో ఉందని. ఒకానొక పనిచేస్తే, అన్ని విషయాలలోనూ స్వతంత్రత ఏర్పడి, అది ఇష్టమున్నా లేకపోయినా, హృదయం ఆహ్లాదంగా మారుతుంది. గాంధీజీ ఇచ్చే స్పూర్తి: నిస్వార్థ కర్మ చేస్తే భద్రత, క్షేమము అంతర్గతంగా ఉన్న దైవ స్వరూప౦ వలన కలుగుతుంది.