Bhagavat Gita
3.7
సహయజ్ఞాః ప్రజాసృష్ట్యా పురోవాచ ప్రజాపతిః
{3.10}
అనేన ప్రసవిష్యధ్వ మేష వో అస్త్విష్ట కామధుక్
సృష్టికాలమున బ్రహ్మదేవుడు యజ్ఞముల తోడ ప్రజలను సృజించి, "ఈ యజ్ఞములచే మీరు వృద్ధి పొందుడు. ఇవి మీ కోర్కెలను నెరవేర్చును" అనెను
శ్రీకృష్ణుడు కామధుక్ --అనగా మన కోర్కెలను తీర్చేది--అంటున్నాడు. అంటే ఏ కోరికైతే మన ఆనందానికి లేదా స్వార్థానికి కాక, ఆధ్యాత్మిక పనుల చేయడానికి, ప్రజల మేలుకై పనికి వచ్చేదో అట్టి కోరిక తీర్చబడుతుంది.
శ్రీకృష్ణుడు ఇంకా ఇలా చెప్పెను: ఒక వ్యక్తి ఎదగాలంటే, నిస్వార్థమైన సంఘ సేవ చెయ్యాలి. దానివలననే శాంతి, ఆనందం, జ్ఞానం పొందగలము. మన జీవితాన్ని ఒక యజ్ఞ మనుకొని పరులకై బ్రతకాలి. మనము యుద్ధము గురించి మాట్లాడితే, ఇంట్లో జరిగే కలహాలను కూడా కలుపుకోవాలి. ఎప్పుడైతే మనమొక్కరమే ముఖ్యులమని తలుస్తామో అప్పుడు కలహమేర్పడుతుంది. అలాకాక మనం కుటుంబంతో, దేశంతో, ప్రపంచంతో కలిసిమెలిసి ఉంటే ప్రపంచ శాంతి సాధ్య మవుతుంది. గత 2000 సంవత్సరాలలో లెక్కపెట్టలేనన్ని యుద్ధాలు జరిగేయి. శాంతికై చేసికొనే సంధి సగటున రెండు ఏళ్ళకన్నా ఎక్కువ కాలం ఉండలేదు. శాంతికై చేసే ఒడంబడిక శాంతి నెలకొల్పటంలేదు. మన ఇళ్ళల్లో, వీధుల్లో శాంతి లేనిదే ప్రపంచ౦లో శాంతి లేదు. కాబట్టి శ్రీకృష్ణుని బోధ రాజకీయ సంక్షోభానికి, జాత్యాహంకారానికి, ఇంటిలోని కాలహాలకు సమానంగా వర్తిస్తుంది. మనందరికీ స్వార్థం ఉండి, దానికై పోరుకెళ్ళే లక్షణం ఉంది. మన గుండెల్లో శాంతి కావాలంటే మనం ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి సాధన చెయ్యాలి.