Bhagavat Gita
5.1
అర్జున ఉవాచ:
సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి
{5.1}
యచ్చ్రేయ ఏతయో తన్మే బ్రూహి మనిశ్చితమ్
కృష్ణా! నీవు ఒకసారి కర్మసన్యాసమును, ఒకసారి కర్మ యోగమును చెప్పుచున్నావు. ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో నిశ్చితముగ నాకు తెలుపుము
శ్రీ భగవానువాచ:
{5.2}
సన్న్యాసః కర్మయోగశ్చ నిశ్శ్రేయసకరా వుభౌ
తయోస్తు కర్మసన్యాసా త్కర్మయోగో విశిష్యతే
కర్మ సన్యాసమును, కర్మయోగమును రెండును మోక్ష దాయకములే. కానీ ఆ రెంటిలోనూ కర్మ సన్యాసము కంటెను కర్మ యోగమే శ్రేష్ఠమైనది
అర్జునుడు కర్మ, యోగం, కర్మ సన్యాసం లలో ఏది ఉత్తమం అని శ్రీకృష్ణుని ప్రశ్నిస్తున్నాడు. ఆ రెండింట్లలో: ఏది వేగంగా గమ్యాన్ని చేర్చేది? ఏది సులభం? ఏది క్షేమం? శ్రీకృష్ణుడు ఇలా సమాధాన మిచ్చేడు "నీకు కర్మ సన్యాసం ఒక గొప్ప ప్రక్రియాలా చూపేను. అలాగే నిస్వార్థ కర్మ కూడా ఒక ప్రక్రియాలా చూపేను. కానీ నీకు వాటిని విశ్లేషించి, ఒకదానితో ఉంకొకటి పోలిక పెట్టే బుద్ధి ఉంది కాబట్టి, నేను నిస్వార్థమైన కర్మే ఉత్తమం అని చెప్తాను."
మనం కర్మ సన్యాసం చెయ్యడానికి సిద్ధంగా లేము. మనము కర్మ చేద్దామని నిర్ణయించుకొన్నా, కర్మ చేయకూడదని నిర్ణయించుకున్నా, మనము కర్మ చేయవలసినదే. అంటే భౌతికంగా కర్మ చెయ్యకపోయినా, మానసికంగా కర్మను చేస్తున్నాము. కాబట్టి మనం ఎన్నిక చేసుకోవలసినది: అందరి క్షేమానికై నిస్వార్థంగా కర్మ చేయడమా లేదా మన స్వార్థానికై కర్మ చేయడమా? మైస్టర్ ఎక్హార్ట్ ఇలా అన్నారు: మనము దేవుని మన కర్మలో భాగంగా చూడాలి లేదా కర్మను చెయ్యడం మానెయ్యాలి. కానీ మానవుడు కర్మను చేయలేక ఉండలేడు కాబట్టి దేవుని మనం చేసే అన్ని కర్మలలో భాగంగా చూడాలి. అది ఎటువంటి కర్మైనా, ఏ పరిస్థితిలో నైనా, దేవుని నమ్మి, మనకి, దేవునికి మధ్య ఎటువంటి అడ్డంకూ లేకుండా చేసికోవాలి.
ధ్యానం గాఢమైన కొద్దీ, నిస్వార్థ సేవ చెయ్యడానికై ప్రయత్నించాలి. ఇతరులతో తగినంత సమయం గడుపుతున్నమా లేదా అని ప్రశ్నించుకోవాలి. ఒకడు ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపస్సు చేసి, ఒక నగరానికి వచ్చేడనుకొందాం. నడుస్తున్నప్పుడు ఎవరైనా తోస్తే "మీ దారికి అడ్డంగా వచ్చినందుకు క్షమించండి" అని అతడు అనడు. కానీ ధ్యానం చేస్తే, రోజూ రోడ్డు మీద తోసుకొని వెళ్ళే వాళ్ళను చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. మనను తోసినవాడి దృష్టి ఒక దుకాణం లోని వస్తువుపై నుండి, మనల్ని అతడు చూసి ఉండక పోవచ్చు. ధ్యానం చెయ్యడంవలన మనకి కోపం రాదు. కానీ ఇతరులకు అలా కాదు. వారికి మన దృక్పథం అర్థం కాదు. కాబట్టి మంత్ర జపం చేస్తూ, ఓర్పు వహించి, గౌరవంగా వారి మాటను విని, మన పరిస్థితి వివరించగలగాలి.
నేటి ప్రపంచం కాలుష్యంతో, హింసతో కూడి ఉండి, నివాసయోగ్యంగా లేదు. కాబట్టి మనము నోరు మెదపకుండా ఉండకూడదు. మనలో చిన్న చిన్న మార్పులు చేసికొని ప్రపంచాన్ని మార్చవచ్చు. మనసా, వాచా, కర్మా అన్ని విషయాలలోనూ, ముఖ్యంగా అనుబంధాలలో, మనము అహింసను పాటించాలి. ద్వేషానికి బదులుగా ప్రేమ, విమర్శకి బదులుగా గౌరవం ఇవ్వగలిగితే మనను మార్చు కోవడమే గాక, మన సంబంధీకులను కూడా మారుస్తాము. మనం పర్యావరణాన్ని మంచికైనా , చెడుకైనా ప్రభావితం చేస్తాం. ఎల్లప్పుడూ మంచి చెయ్యాలంటే, దాన్ని పలు మందికి ఆచరణ యోగ్యము చెయ్యాలంటే, గట్టి ప్రయత్నం నిస్వార్థంగా చెయ్యాలి.
ధ్యానంలో మనం చేతన మనస్సు లోతుల్లోకి వెళ్తాము. అక్కడ నిర్మానుష్యంగా ఉంటుంది కాబట్టి ఇతరులతో మాట్లాడి, కలిసి నవ్వుకొని, కలిసి పాటలు పాడి, జీవితాన్ని సామరస్యంతో గడపాలి. ఆధ్యాత్మిక పథంలో కష్టపడి పనిచెయ్యడం, సత్సంగం ఉంచుకోవడం చాలా అవసరం. వాటివలన మన సాధన మెరుగుపడుతుంది. 298
No comments:
Post a Comment