Bhagavat Gita
7.10
బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం
ధర్మావిరుద్దో భూతేషు కామో అస్మి భరతర్షభ
{7.11}
అర్జునా! బలవంతులకు కామానురాగములు లేని బలమును నేనే. ప్రాణులయందు ధర్మమునకు విరోధము కాని కామము నేనే
చిన్నప్పుడు నేను ఎంతో వ్యాయామంచేసి కండలు పెంచిన వారిని, అతి ఎక్కువ దూరం గెంత గలిగినవారిని, గజ ఈతగాళ్ళని చూసేను. నాకు నా అమ్మమ్మద్వారా తెలిసినదేమిటంటే నిజమైన బలము మన కండరాలకే పరిమితము కాదు. సహనం, స్థితి స్థాపికత, ఓపిక తో ఎట్టి సమస్యనైనా ఎదుర్కొనగల శక్తి కూడా బలమే.
అట్టి బలము మనను నియంత్రించుకోగల శక్తి వలననే సాధ్యం. ఒక వ్యక్తి చీటికీ మాటికీ కోపం తెచ్చుకొ౦టే, వానికి క్షణికమైన వాటిమీద మక్కువ ఉంటుంది. కాని మన ఉద్రేకాన్ని అణచుకొంటే, మన౦ అందరి శ్రేయస్సు కై పాటు పడవచ్చు.
నేను ఆంగ్లం నేర్చుకొంటున్నప్పుడు "చైనా అంగటిలో ఎద్దు" అనే పదప్రయోగమును చూసేను. నాకది అర్థంకాలేదు. మేము అరటి ఆకులలో భోజనం చేసేవారము. ఆ తరువాత ఆకులను ఆవులకు మేతగా పెట్టేవారము. నా మామయ్య ఒక ఉన్మత్త ఏనుగును చూసి జంతువులు, మనుష్యులు పారిపోవలసిందే అని చెప్పేవాడు. ఆ ఏనుగుపై ఒక పులి చెట్టు పైనించి దూకి ఎదుర్కోగలదు. కానీ దాని ప్రాణ భయం పోదు. క్రోధం అటువంటిదే. ఇష్టమొచ్చినట్టు అడ్డమొచ్చిన వారలపై కోపము ప్రదర్శించి ఇతరులను బాధ పెట్టడంవలన లాభం లేదు. దాన్ని ఒక ఉన్నతమైన, స్వార్థరహిత లక్ష్యంవైపు త్రిప్పుకోవాలి. అలాగే భావోద్వేగం కూడా. దానికై చాలా సహనముండాలి. మనము ఒక స్వార్థపూరిత కోర్కెను లేదా ఉద్రేకాన్ని స్వాధీనంలో పెట్టుకోగలిగితే శ్రీకృష్ణుడు "నీ సహనం, బలం నేనే" అంటాడు.
ఇంకా శ్రీకృష్ణుడు "నీ కోర్కె నిస్వార్థ మైతే, నేను అందులో ఉన్నాను" అని అంటాడు. అలాగని మన౦ అన్ని స్వార్థమైన కోర్కెలను వదులుకోనక్కరలేదు. ఉదాహరణకి మన ఇంట్లో విందు జరిగితే మనం నోరుకట్టుకొని ఒక మూల కూర్చోనక్కరలేదు.
అలాగని శ్రీకృష్ణుడు మనం మద్యం సేవిస్తూ ఉంటే దాన్ని ప్రోత్సాహిస్తాడు అనుకోవడం అపోహ.
ఈ విషయాల్లో ముఖ్యమైనదేమిటంటే, మనమొక కర్మ ఇతరుల గురించి చేస్తున్నామా లేదా. మనమొక పెళ్లి విందుకు వెళ్ళి అక్కడ అందరూ పప్పు, కూర తింటూవుంటే కేవలం పళ్ల రసం, నీరు త్రాగడంతో సరి పెట్టుకోనక్కరలేదు.
అలాగే తక్కిన చట్టబద్దమైన కర్మలు. నేను పనిలో ఉక్కిరిబిక్కిరిగా నున్నా, నా మిత్రులతో ఈత కొట్టడ౦, టివి లో టెన్నిస్ మ్యాచ్ చూడడం, లేదా కర్ణాటక సంగీత కచేరీకి వెళ్ళడం చేస్తాను. అనగా మనము ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ చిన్న చిన్న కోర్కెలను అణచుకోనక్కరలేదు. కాని మనమందరినీ కలుపుకొని నిస్వార్థంగా బ్రతకాలి.