Bhagavat Gita
7.9
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్
{7.10}
బుద్ధి ర్బుద్ధిమతా మస్మి తేజ స్తేజస్వినా మహమ్
పార్థా! సర్వభూతములకు శాశ్వతమైన బీజస్థానమును నేనే. బుద్ధిమంతులయొక్క బుద్ధియు, ధీరపురుషుల యొక్క ధైర్యమును నేనే ఀ
పరమాత్ముడు సృజనాత్మక శక్తికి బీజము. ఎలాగైతే వంకాయ విత్తనాలు వంకాయ చెట్టుగా మొలకెత్తుతాయో, బీరకాయ విత్తనాలు బీరకాయ చెట్టుగా మొలకెత్తుతాయో, పరమాత్మ బీజము పరమాత్మ చెట్టుగా మనలో మొలకెత్తుతుంది.
మనము కొట్టులో టొమాటో విత్తనాలు కొని, వాటిని పాతి, మరుసటి రోజు ఇంకా మొలకెత్తలేదని కొట్టు వాడిని అడిగితే లాభం లేదు. టొమాటో విత్తనం పాతిన తరువాత ఒక్క రోజులోనే మొలకెత్తదు. అది మొలకెత్తడానికి సారవంతమైన భూమి, నీరు, తగిన వాతావరణం ఉండాలి. అలాగే పరమాత్మ బీజము చెట్టుగా మారాలంటే చాలా రోజులు వేచి చూడాలి.
అదృష్టవశాత్తూ పరమాత్మ బీజము నాశనము లేనిది. అది మనలోనే ఎప్పటికీ ఉన్నది. అది తీవ్రమైన వాతావరణంలో -- అంటే మండేటెండలో, వణికించే చలిలో--రాణించ గలదు. మన౦ గతంలో ఎన్ని తప్పులు చేసినా ఆ బీజం చెక్కుచెదరకుండా మనలో ఉన్నది. కాని అది భయం, క్రోధం, లోభం అనబడే కలుపు మొక్కలతో కప్పబడి ఉన్నది. మనం ధ్యానం చేయడం మొదలుపెడితే ఆ కలుపు మొక్కలు వాడి, నశించి, పరమాత్మ బీజము మొలకెత్తుతుంది.
బుద్ధి అనగా విచక్షణ లేదా మేధ. దాని సహాయంతో మన అంతర్గత తోటను ప్రక్షాళనము చేసికోవచ్చు. బుద్ధి మనకు క్షణికమైన ఆనందము కావాలో, శాశ్వతమైన ఆనందము కావాలో నిర్ణయిస్తుంది. కఠ ఉపనిషత్తులో చెప్పబడిన దేహమనే రథానికి, బుద్ధి సారధి. అది ఆత్మ సహాయము తీసికొ౦టే, మనను సక్రమ మార్గంలో నడుప గలదు.
శ్రీకృష్ణుడు చెప్పేది: ఎటువంటి కష్టముతో కూడిన నిర్ణయము తీసికొన్నా, నేను దాని జ్ఞానముగా ఉన్నాను. దాని నుండి స్వతంత్రము పొందితే మనము క్షణికమైన సుఖములు గురించి ఆలోచించము. కాని అట్టి ఎన్నిక చేసికోవడం సులభం కాదు. దానికి ధైర్యము, ఓర్పు అవసరం. అందుకే హిమాలయాలు ఎక్కాలన్నా, అంతరిక్షంలోకి వ్యోమగామిగా వెళ్లాలన్నా మిక్కిలి ధైర్యం ఉండాలి. శ్రీకృష్ణుడు "నీకు సవాలు తీసికోవడానికి ధైర్యం ఉంటే, నేను నీ ధైర్యాన్ని అవుతాను" అన్నాడు.
పరమాత్మ ఎక్కడో "ఆ మూల సౌధంబులో" లేడు. మనలోనే జ్ఞానంగా, ధైర్యంగా ఉన్నాడు. ఒక వ్యోమగామి దేవుడు విశ్వాన్ని సృజించేడు అనేవారు పిరికివాళ్ళు అని అన్నాడు. మనకు భగవంతుని సృష్టి అవగాహనకు రానంత మాత్రాన అట్టి భావాలు మనస్సులో పెట్టుకోకూడదు. అతడు పరమాత్మ నక్షత్ర వీధిలో ఎక్కడో సభ పెట్టి ఉన్నాడని అనుకుంటున్నాడు కాబోసు. పరమాత్మ అంతటా ఉన్నాడు. ఎక్కడైతే కాంతి, అందము, శ్రేష్ఠత ఉన్నాయో అక్కడ పరమాత్ముని జాడలు ఉన్నాయి.