Bhagavat Gita
7.13
చతుర్విధా భజ౦తే మా౦ జనా సుకృతినో అర్జున
{7.16}
ఆర్తో జిజ్ఞాసు రర్ధార్థీ జ్ఞానీ చ భరతర్షభ
అర్జునా! నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్ను భజించుచున్నారు. వారు ఆర్తుడు, జిజ్ఞాసువు, ఆర్థార్థి మరియు జ్ఞాని. ఀ
ప్రజలు ఆధ్యాత్మిక జీవనమునకై అనేక కారణాల వలన వస్తారు. ఎక్కువమంది భౌతిక, మానసిక బాధల వలన వస్తారు. ధ్యానం చేసే ముందు నాకు బాధను అనుభవించడం వలన తెలిసికొనే పాఠం గురించ తెలీదు. భగవంతుని దయ బాధను అనుభవిస్తేనే వస్తుంది. మన చెడు నడవడికను మార్చుకొంటేనే భగవంతుడు మనపై కరుణ చూపుతాడు.
అతిగా బాధపెట్టేది సాధనచేసేందుకు మనము కొన్ని త్యజించిడంవలన, మనను మననుండి వేర్పాటు చేసికోవడంవలన. కరుణామయుడైన పరమాత్మ మనకు బాధ ఎందుకు కలిగిస్తాడ౦టే, మనను తనవైపు త్రిప్పుకొనుటకు. బాధ కలిగించేది మనను ఆనందదాయకముగా చేయుటకు. ఎవడైతే అహంకారాన్ని వీడుతాడో వానికి ఇంక బాధ ఉండదు.
రెండవ కోవకు చెందినవారు జిజ్ఞాసులు. వారికి అన్నిటి గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. వారు ఆనందమునకై అనేక హోటల్ లను, దేశాలను తిరిగి ఉండచ్చు. చివరకు వారు హోటల్ కు వెళ్ళడం వలన దేహంలో కొవ్వు పడుతుందని, దేశ దిమ్మరిగా ఉండడంవలన బంధాలు ఉండవని, జీవితానికి ఒక లక్ష్యం ఉండాలని, తెలిసికొ౦టారు.
జిజ్ఞాసు తను ముందు చూడని వస్తువులను చూడాలని ఆతృత పడుతూ ఉంటాడు. ఒక పెట్టె గుడ్డచే కప్పబడి ఉంటే, ఆ గుడ్డ క్రింద ఏముందో చూడాలనుకొంటాడు. ఇటువంటి కుతూహలం విచారణకు దారి తీసి, చివరకు జ్ఞాన సముపార్జనకు హేతువు అవుతుంది. ఉదాహరణకి "కృష్ణ బిలం తనలోకి లాక్కొన్న పదార్థాలను ఎక్కడకు తీసికెళ్తుంది? అవి మళ్ళీ సృష్టింప పడతాయా?" మొదలైన సామాన్యులకు కలగని ప్రశ్నలు జిజ్ఞాసువుకు కలుగవచ్చు.
కళాకారులలో కూడా జిజ్ఞాసులు ఉంటారు. అట్టివారు నాతో "నాలో ఏదో శక్తి ఉందని తెలుసు. కానీ దానిని వెలుపలకి తీసికొని రాలేక పోతున్నాను. ఎక్కడో అవరోధం కలుగుతోంది" అని చెప్పేవారు. నేను వారిని ధ్యానం చేయమని ప్రోత్సాహించే వాడను. ధ్యానం వలన మనలోని సృజనాత్మక శక్తి విడుదల అవుతుంది.
ఇక జ్ఞానులు నాల్గవ కోవకు చెందిన వారు. వారు జీవిత లక్ష్యాన్ని తెలిసికొనుటకు, దానిని సాధించే మార్గమును అన్వేషించుటకు ధ్యానం చేస్తారు. వారు ధన సముపార్జనమే, ఇంద్రియ లోలత్వమే జీవితాశయం కాదని తెలిసికొ౦టారు. వారు "శాశ్వతమైన ఆనందాన్ని ఎలా పొందాలి?" అనే లక్ష్యంపై సాధన చేస్తారు. ధ్యానం హృదయ పూర్వకంగా, క్రమ బద్దంగా చేసేవారు తమకి ధ్యానం మొదట్లో ఎలాంటి లక్ష్యం ఉన్నా, ఆ ప్రశ్నని అడుగుతారు. క్రమంగా భౌతిక లేదా మానసిక సమస్యలున్నవారు తమ అంతర్గత లోతుల్లో ఉన్న శక్తిని వెలికి తీస్తారు. చివరగా వారు శాశ్వతమైన శాంతితో, ఆనందంతో కూడిన జీవితాన్ని పొందాలనే జ్ఞానులుగా అవుతారు.