Bhagavat Gita
7.14
తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏక భక్తిర్విశిష్యతే
{7.17}
ప్రియో హి జ్ఞానినో అత్యర్థ మహం స చ మమ ప్రియః
ఈ నలుగురిలో నిత్య యుక్తుడును, ఏకాంత భక్తి కాలవాడును -- అగు జ్ఞాని శ్రేష్టుడు. అట్టి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైన వాడను. అతడు నాకును ప్రియుడై యున్నాడు.
ఉదారా స్సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్
{7.18}
అస్థిత స్సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్
ఈ భక్తులందరు ఉదార చరితులే. జ్ఞాని మాత్రము సాక్షాత్తు నా స్వరూపమే. అతడు నాయందే మనసు నిలిపి నన్నే పరమగతిగ ఆశ్రయించి యున్నాడు
ఇక్కడ ముఖ్యమైనది: నిత్యాయుక్త. అనగా సదా శ్రీకృష్ణునితో ఏకమైనవాడు. అటువంటి వ్యక్తి శ్రీకృష్ణుని హృదయమునందు మిక్కిలి ఆనందమును నింపును.
శ్రీకృష్ణుడు "అటువంటి వ్యక్తిని చూస్తే, నువ్వు నన్నే చూస్తున్నావని" చెప్పెను. జీసస్ తన శిష్యుడు ఫిలిప్ తో అటువంటి భావాన్నే వచించేడు: "నువ్వు నన్ను చూస్తే, నా తండ్రిని చూసినట్టే". ఇది చాలామంది యోగులకు నివాళి: మోసెస్, మైస్టర్ ఎక్ హార్ట్, తెరెసా ఆఫ్ ఆవిలా, సెయింట్ ఫ్రాన్కిస్ ఆఫ్ అస్సీసీ, జాన్ వూల్ మన్, జలాలుదీన్ రూమి, శ్రీ రామకృష్ణ, గాంధీ. ఇట్టివారు మనలాగే జన్మించి, మనకన్నా ఎక్కువ బాధలు అనుభవించి, ధ్యానంతో, నిస్వార్థమైన జీవనంతో, మోక్షం పొందే వరకు జీవుల ఐక్యతను పెంపొందించేరు. మనం ఒక మూలకూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసేవాడు మన మిత్రుడు లేదా బంధువు లా కాక, వాని ద్వారా పరమాత్మ తన కార్యాన్ని ప్రారంభిస్తున్నాడని తలంచవలెను.