Bhagavat Gita
7.15
బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే
{7.19}
వాసుదేవ స్సర్వమితి స మహాత్మా సుదుర్లభః
అనేక జన్మ పరంపల జ్ఞానమును సంపాదించిన జ్ఞాని సర్వమును వాసుదేవుడే యని గ్రహించి నన్నే సేవించుచున్నాడు . అట్టి మహాత్ముడు చాలా అరుదుగ నుండును
శ్రీకృష్ణుని మరొక నామము హరి అనగా చోరుడు. అతడు మన గుండెను చౌర్యము చేసి మనల్ని వెదకమని ప్రపంచంలోకి పంపించేడు.
ఇక్కడ శ్రీకృష్ణుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాడు. మనము ఎన్నో జన్మలెత్తితేగాని ప్రపంచము స్థిరము కాదని దేవుడొక్కడే శాశ్వతమని తెలిసికోలేము. ఈ విధంగా స్వార్థ రహితమైనవారు ఎక్కువ పరిణామం పొందిన వారు. వారు జగత్తు క్రీడాస్థలమని ము౦దే తెలిసికొన్నారు. ఎవరైతే అట్లు తెలిసికోలేదో వారికి అనుభవం ఇంకా రాలేదు. ధనవంతుల ఇంట్లో పుట్టినవానికి ధనం విలువ తెలిసి దానిని తెలివిగా వాడుతాడు. వానికి ధనం యొక్క నిజమైన విలువ తెలుసు. కానీ మనలో కొందరికి నడిమంత్రపు సిరి వచ్చి వస్తువులకై ధనము వెచ్చిస్తాము. అలా వస్తువులు కొని కొంతకాలానికి అవి అన్నీ బొమ్మలవంటివని తెలిసికొ౦టాము. టివి క్రొత్తగా కనిపెట్టినపుడు పేద దేశాల్లో ప్రజలు విరగబడి చూసేవారు. వారికి టివి లో జరిగే సంభాషణ అర్థమవ్వక పోయినా అదే పనిగా చూసేవారు. సంపన్న దేశాల్లో టివి అన్నిచోట్లా ఉంది. అతి ఒక వింత వస్తువు కాదు. దాని వలన మనము పూర్ణమైన ఆనందమును పొందలేము. ఆనందము మనలోన ఉన్నది. ఎన్ని ఎక్కువ కోర్కెలు ఉంటే అంత ఎక్కువ విచారాన్ని పొందుతాము. అశాంతితో కూడిన జీవితం దేవుడిని పొందాలనే కాంక్షకు చిహ్నం. అప్పుడు మనము అంతర్ముఖులమై సంపూర్ణమైన ఆనందము, జ్ఞానము, భద్రత పొందుతాము.
అటువంటి ఆనందాన్ని పొందిన తరువాత విశ్వంలో దేవుడు తప్పిస్తే ఏదీ శాశ్వతము కాదని తెలిసికొ౦టాము. అది మేధకి సంబంధించినది కాదు. ప్రతీదీ భగవంతుని స్వరూపమని అవగాహన పొందుతాము. అదే వాసుదేవ సర్వం అంటే. సెయింట్ అంజిలా ఆఫ్ ఫాలిగ్ నో ఈ విధంగా చెప్పేరు:
నా ఆత్మ కన్నులు తెరిచి, దేవుని యొక్క పూర్ణత్వము చూసేను. తద్వారా సర్వ ప్రపంచం, ఇక్కడ మరియు సముద్రములకు ఆవల, మహా సముద్రపు లోతులలో కూడా చూసేను. వీటిలో దేవుని శక్తి తప్ప మరేదీ లేదని, నాకు వర్ణించడానికి మాటలు లేవని తెలిసికొన్నాను. అలా అబ్బురపడుతూ "ప్రపంచమంతా దేవునితో నిండి ఉన్నది" అని బిగ్గరగా అరిచేను.