Bhagavat Gita
17.16
కామై స్తై స్తైర్రుత జ్ఞానాః ప్రపద్యంతే అవ్యదేవతాః
{7.20}
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్స్వయా
మానవులు తమ తమ స్వభావము ననుసరించి, కోరికలచే జ్ఞానమును జారవిడచుకొనిన వారై, ఆయా కోరికలకు సంబంధించిన దేవతల నారాధించుచు ఆ దేవతలనే చేరుచున్నారు
హిందువులు వివిధ నడవడికలు గలవారై, దానికి అణుగుణంగా దేవతులను ఆరాధిస్తారు. ఉదాహరణకి కుబేరుడు ధనానికి ప్రతీక. ఎవరైనా నేను కుబేరుని పూజిస్తున్నాను అంటే వానికి ధనార్జనము మక్కువ అని ఇతరులకు సులభంగా అర్థమవుతుంది. అలాగే లక్ష్మీ దేవి.
కాముడు లేదా మన్మథుడు కామమునకు ప్రతీక. అతడు 5 రకాల -- ఒక్కొక్క ఇంద్రియానికి -- బాణాలతో జనులను సమ్మోహితులను చేస్తాడు అని హిందువులు నమ్ముతారు.
ధనము, కామము ఈ రోజుల్లో మనను గజిబిజి చేసేవి. నాకిది కావాలి, అది కావాలి అనుకొంటూ ఉంటే బుద్ధి సక్రమంగా పనిచెయ్యలేదు. బుద్ధి ఆత్మను అనుసరించి మనచే జ్ఞానవంతమైన కార్యములను చేయించవలెను. కానీ ఎంతసేపూ కాముడు, కుబేరుడు గూర్చి ఆలోచిస్తూ ఉంటే బుద్ధి అన్ని దిక్కులా లాగబడుతుంది. కొన్నాళ్ళకు మనకు ఆదర్శవంతమైనది లేక, మన జీవితానికి లక్ష్యం లేదని భావిస్తాము.
సంపన్న దేశాల్లో ప్రసార మాధ్యమాలు దేవతలకు బదులుగా ధనాన్ని, కామాన్ని కలిగిస్తాయి. వాటిక తోడు హింస. టివి లోని హింసాకాండ తాత్కాలికంగా చూపించినా, అది మన చేతన మనస్సులో ముద్రితమై ఉంటుంది. కామమును ఎరగా పెట్టి టివి తమ ప్రేక్షకులను ఎక్కువ చేసికొ౦టారు. దానివలన ఆనందం లేకపోగా, నిజ జీవితంలో మాన భంగాలు పెరుగుతున్నాయి. ధనాన్ని జీవిత లక్ష్యంగా చేసికోవడం వలన ఆనందం కలుగకపోగా, మనుష్యులు, ఇల్లు, వాహనాల యందు నిర్లక్ష్యవైఖరి ఎక్కువ అయింది. క్రమంగా మనం అభద్రతతో జీవించడానికి అలవాటు పడ్డాం. ఇళ్ళలో సెక్యూరిటీ అలారం పెట్టించుకొని, తుపాకీలను ధరించి, మన భద్రతను కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్నాము.
ప్రసార మాధ్యమాలతో బ్రతుకుతున్న వారిపై జాలి చూపాలి. ఎందుకంటే వారికి నిజ జీవితంలో ఆదర్శప్రాయంగా ఉండే వారు కనుమరుగైపోతున్నారు. ఇది పుస్తకాల ద్వారా, ఉపన్యాసాల్ల ద్వారా చెప్పేది కాదు. స్వీయానుభవము ఉంటే గాని సాధ్యమవ్వదు. దీనినే విజ్ఞాన మంటారు. మనము తెలివి నుపయోగించి ఒక సమస్యను పరిష్కరించవచ్చు. అది సరిపోదు. మన జీవితంలో ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఆచరణలో చూపాలి. గాంధీ మహాత్ముడు అట్టి యోగి. ఒక విలేఖరి ఆయనను ఒక సందేశం ఇమ్మని అడిగేడు. దానికి ఆయన సమాధానం ఒక కాగితం మీద "నా జీవితమే సందేశం" అని వ్రాసి ఇచ్చేరు. ఆయన స్వీయానుభవాలు అహింసా సిద్ధాంతం, రాజకీయ చాతుర్యములకే పరిమితం కాక దేశ ఆర్థిక , శిక్షణ వ్యవస్థలను కూడా ప్రభావితం చేసేయి. భవిష్యత్తులో చరిత్రకారులు నేటి యుగం అణుశక్తిదిగా కాక గాంధీ యుగమని వ్రాయవచ్చు.
ఒకడు కేవలం లాభానికే వ్యాపారం చేస్తే, అతడు ధనార్జనే జీవిత లక్ష్యం అనడానికి చిహ్నం. అతడు వాణిజ్యంలో పెట్టుబడులు, మదుపులు ఎలా పెట్టాలో అనర్గళంగా చెప్పగలడు. మరియు చిత్ర విచిత్ర స్థలాలకు -- మాన్టీ కార్లో, లాస్ వేగాస్ మొదలైన--సలవులలో వెళ్తాడు. డౌ జోన్స్ సూచిక గురించి నిరంతరము ఆలోచిస్తూ ఉంటాడు. వాని జీవితం ఒక తెరిచిన పుస్తకములాంటిది. ఎవరైతే దాన్ని చదివితే తెలిసేది వాని లోభము వలన ప్రేమను పంచిపెట్టడు, ప్రేమను పొందడు. కానీ పరోపకారానికై జీవించే వ్యక్తికి ప్రేమ, జ్ఞానము రెండూ కలిగి ఇతరులకు ఆదర్శప్రాయుడవుతాడు. అట్టి వారు తమ గురించి ప్రచార మాద్యాలలో ప్రకటనలు ఇవ్వనక్కరలేదు. మనమే వారికై వెతికి, వారి జీవితాన్ని స్పూర్తి గా తీసికొ౦టాము.