Saturday, April 9, 2022

Eknath Gita Chapter 7 Section 19

Bhagavat Gita

7.19

అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్య౦తే మా మబుద్ధయః {7.24}

పరం భావ మజానంతో మమావ్యయ మనుత్తమమ్

అవ్యయమైనట్టియు, శ్రేష్ఠమైనట్టియు, సర్వోత్కృష్టమై నట్టియు నా యొక్క స్వభావమును తెలియని మూఢులు అవ్యక్త రూపుడనైన నన్ను వ్యక్త స్వరూపునిగ భావించుచున్నారు ఀ

బ్రహ్మన్ అనగా సర్వ సృష్టికి మూల కారణం. అది అవ్యక్తమై, లక్షణములు లేనిదై, శుద్ధమై ఉండేది. ఒకమారు ఆది శంకరులు గౌడపాద అనబడే యోగిని నర్మదా నది ఒడ్డున కలిసి, తనకు బ్రహ్మన్ గురించి చెప్పమని అడిగెను. ఆయన, నిర్గుణ బ్రహ్మన్ ఉపాసికుడైనందున, తన శిష్యుడైన గోవిందపాద వద్దకు వెళ్ళమని సూచించెను. గోవిందపాదుడు సగుణ బ్రహ్మను ఉపాసించినవాడై ఆది శంకరులకు గురువైనాడు.

నిర్వికల్ప సమాధి అనగా నిర్గుణ బ్రహ్మన్ యందు సంపూర్ణమైన, అఖండమైన చేతనముతో కూడిన తపస్సు. అది అందరికీ సాధ్యం కాదు. అందుకే చాలామంది సవికల్ప సమాధి లేదా సగుణ దేవతను పూజిస్తారు. భక్తుడు తన ఇష్ట దేవతకై ధ్యానము చేసి, ద్వంద్వ ప్రపంచంతో సంబంధమును వీడక యుండును. వానికి జ్ఞానము, జ్ఞేయము మధ్య తేడా ఉంది.

మనలో చాలామందికి సగుణ దేవతోపాసన మాత్రమే సాధ్యం. మనకి నిర్గుణ దేవతపైన ఆసక్తి ఉండవచ్చు. కానీ అది సరిపోదు. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మనం ప్రేమించగలిగే, మనకు ఆదర్శప్రాయంగా ఉండే దేవత ఉండాలి. శ్రీ రామకృష్ణ ఇట్లు చెప్పెను: పరమాత్మ సగుణ మరియు నిర్గుణుడై యున్నాడు; రూపరహితుడైన నిర్గుణ బ్రహ్మన్, భక్తునికి సగుణ రూపమున కనబడుచున్నాడు.

శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ధర్మమునకు హాని కలుగుచున్నదో తాను అవతారమును దాల్చుచున్నానని చెప్పెను. అతనికి సర్వ మానవ లక్షణాలు: నవ్వుట, ఏడ్చుట, మాట్లాడుట, తినుట మొదలగునవి ఉంటాయి. అవతార పురుషుడై పుట్టుక, మరణము పొందియున్నను అతడు నిజముగా అపరిమితుడు, అవ్యక్తుడు.

మనము దేవతలను మానవ రూపంలో ఊహించినట్టే, తక్కిన జంతువులు దేవుని తమ రూపములలో చూసుకొనవచ్చును. కాబట్టి దేవునికి ఒక స్వరూపానికే పరిమితము కాదు. మన ఇష్ట దైవము అందరికన్నా మిన్నని భావించుట వ్యర్థము. ఎందుకంటే అపరిమితమైన బ్రహ్మన్ ను, పరిమితమైన అవతారంలో బంధిస్తున్నాము. మాటలతో నిర్గుణ బ్రహ్మన్ ను పూజించడం సాధ్యం కాదు. 77

No comments:

Post a Comment

Juror Types

Before I proceed with juror types on a light-hearted note, I will point out that both current VP JD Vance and his telugu wife have law ...