Bhagavat Gita
7.21
వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున
{7.26}
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన
అర్జునా! నేను భూత వర్తమాన భవిష్య ద్విషయములు నన్ని౦టిని తెలియుదును. కాని నన్ను మాత్ర మేవరును ఎరుగరు
ఖగోళ శాస్త్రజ్ఞులు ఒకప్పుడు పాల పు౦తే విశ్వమనుకొన్నారు. నేటి శాస్త్రజ్ఞులు అటువంటి పుంతలు, నక్షత్ర వీధులు కోట్లాను కోట్లు ఉన్నాయని గ్రహించేరు. అలాగే మన సూర్యుడు అనేక కోట్ల నక్షత్రాలలో ఒకటని గ్రహించేరు. ఇదే శాస్త్రాని కున్న లక్షణము. దానికి అంతులేదు. అది ప్రయత్నము చేసి, తక్కువ లేదా ఎక్కువ అంచనా వేసి, సరిదిద్దుకొంటుంది.
భౌతిక శాస్త్రము ప్రకృతికే పరిమితమైనది. శాస్త్రజ్ఞులు ఒక పదార్థాన్ని విభజించి దాన్ని విశ్లేషిస్తారు. కాబట్టి దాని వలన సంతృప్తి రాదు. అది కెరటాల గురించి విపులంగా చెప్తుంది కాని, వాటి క్రిందనున్న మహా సముద్రాన్ని గాంచలేదు. శ్రీకృష్ణుడు లోకాలను మెడకి పూసల దండగా వేసికొన్నాడు. శాస్త్రజ్ఞులకు తెలిసింది ఒకటి లేదా రెండు పూసల గురించి. ఒక్కక పూస మనం ఊహించలేని విశ్వమై ఉన్నది. ఇటువంటి పూసలు లెక్కపెట్టలేనన్ని. నిజంగా శ్రీకృష్ణుని పూసల దండకి ఆద్యంతాలు లేవు. యోగుల సాధన ఆ దండ వేసికొన్నవానిని పొందుటకు.
సృష్టిని తెలిసికోవాలంటే సృష్టి కర్తను తెలిసికోవాలి. ఎందుకంటే అతడే అన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించేడు. అతడు శాస్త్రజ్ఞులు కనుక్కొ౦టున్న సూత్రాలకి మూలము. ఉపనిషత్తులు అడుగుతున్నాయి "ఎవరిని తెలిసికొ౦టే తక్కిన వన్నీ తెలియబడతాయి?" అదే జ్ఞానము. దాని సూత్రాలను మార్పు చేయ నవసరము లేదు. ఖగోళ శాస్త్రమునకు సంబంధించిన పుస్తకాలను కాల క్రమేనా మార్పులు చెయ్యాలి. కాని భగవద్గీత వంటి శాస్త్రము మార్పు చేయ నవసరములేదు. ఈ శాస్త్రము చెప్పే విలువలు--ఉదాహరణకు సహనం-- చిరకాలం ఉన్నవి, ఉండేవి. ఐదు వేల సంవత్సరాల తరువాత మనము ఇంకొక సౌర్య కుటుంబానికి వెళ్ళి, అక్కడ సముద్ర గర్భంలో నున్న హోటల్ లో భోజనం చేయవచ్చేమో. శాంతి కావాలంటే సహనం ఉండాలి.