Bhagavat Gita
7.22
ఇచ్చా ద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత
{7.27}
సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప
అర్జునా! రాగద్వేషములచే కలిగిన ద్వంద్వములచే మోహింపబడి సకల ప్రాణులు పుట్టుక తోడనే మోహమును పొందుచున్నవి
మనకు దుఃఖము రెండు విధాలుగా కలుగుతుంది: కావలసిన వస్తువు రాకపోతే, వద్దనుకునే వస్తువు వస్తే.
కఠోపనిషత్తు ప్రేయ మరియు శ్రేయ అను పద ప్రయోగము చేయును. ప్రేయ అనగా ఇప్పుడు ఆనందంగా ఉండి, భవిష్యత్తులో అభద్రత, ఇబ్బంది కలిగించేది. శ్రేయ అనగా ప్రస్తుతం ఇబ్బంది కలిగించినా, కాల క్రమేణా మంచి చేసేది. మనము జీవితమనే కళలో ఎంత వెనకబడి ఉన్నామంటే: మనకి క్షణిక సుఖమిచ్చి, శాశ్వతముగా నష్టమిచ్చే వస్తువులను పోగుచేసుకొ౦టున్నాము. అలాగే ప్రస్తుతం కొంత ఇబ్బంది కలిగించి శాశ్వతమైన సుఖమివ్వగల వస్తువులను జార విడుచుకొంటున్నాము.
మనము చాక్లెట్ తినడానికి ఇష్ట పడతాం. ఒకటి లేదా రెండు చాక్లెట్ లు తినడంవలన క్షణిక సుఖ౦ కలుగుతుంది. దానిని అదే పనిగా తింటే పళ్ళుపుచ్చుతాయి, శరీరంలో కొవ్వు పెరుగుతుంది. మనమెలాగ చాక్లెట్ ను కోరుకున్నామో, అలాగే ఆకుకూరలు, సేంద్రీయ కూరగాయలు కొంచెం ప్రయత్నించి ఇష్టమైనవిగా చేసికోవచ్చు.
ద్వంద్వములలో అన్నిటికన్నా ఇష్టాయిష్టాలు ఎక్కువ ప్రభావం కలిగి ఉంటాయి. అలాగే సుఖ-దుఃఖాలు, చలి-వేడి మొదలైనవి.
మనము ఇష్టాయిష్టాలను అధిగమించాలంటే ఇతరులకు ఆనందాన్ని కలిగించే పనులు చెయ్యాలి. ఉదాహరణకి మనమొక ఉద్యోగం ఇచ్చే జీతం లేదా హోదా కన్నా, దానివలన కలిగే పరోపకారం బట్టి ఎన్నుకోవచ్చు. అలాగే మనకయిష్టమైన వంట ప్రయోగం మన భాగస్వామి చేస్తే తినడానికి ప్రయత్నించడం, లేదా పిల్లలతో ఆడుకోవడం వంటివి మనకి ఆనందం వెంటనే ఇవ్వకపోయినా చేయడం మంచిది.