Saturday, April 9, 2022

Eknath Gita Chapter 7 Section 23

Bhagavat Gita

7.23

యేషాం త్వంతగతంపాపం జనానా౦ పుణ్య కర్మణాం {7.28}

తే ద్వంద్వమోహనిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః

ఏ పుణ్యాత్ములు పాప రహితులగుచున్నారో వారు ద్వంద్వ మోహము లేనివారై, నిశ్చల భక్తులై నన్ను సేవించుచున్నారు ఀ

శ్రీకృష్ణుడు ద్వంద్వములగూర్చి ఇంకా చెబుతున్నాడు. ద్వంద్వములు -- మంచి-చెడు, దుఃఖము-సుఖము-- మాయ వలన కలుగుచున్నవి. మన అహంకారం ఈ ద్వంద్వాలతో పనిచేస్తుంది. ప్రతి దేశంలోనూ, సమాజంలోనూ ఎవడో ఒకడికి తక్కువ అహంకార ముండి ఇతరులయందు దయ కలిగి ఉంటాడు. ఒక్కొక్కప్పుడు మామిడి పండు ముట్టుకుంటేనే దానిలోని టెంక బయటకు వస్తుంది (ఉదాహరణ రసాలు). కానీ బంగినిపల్లి మామిడిపండులోని టెంక కత్తితో కోస్తే గాని తెలియబడదు. మన ఇష్టాయిష్టాలకు లోబడితే బంగినిపల్లి మామిడి పండులాగే కత్తిని ఉపయోగించాలి. శ్రీ రామకృష్ణ మనము ఒకరిపై పూర్తిగా ఆధారపడనక్కరలేదు అని చెప్పేరు. అంటే మనమే ఇతరులపై ఆధారపడడానికి నిశ్చయించుకొన్నాం.

మనమెంత ఇష్టాయిష్టాలను మార్చుకోగలమో , ఇతరులలో శుద్ధమైన, నిస్వార్థమైన ఆత్మను చూడవచ్చు. ఇది చాలా కష్టమైనది. కొందరు చీకాకుతో, అహంకారంతో ఉంటారు. అటువంటివారిని విమర్శించుటకంటే, వారిలోని మంచి గుణాలను --దయ, ఉదారత, నిస్వార్థం మొదలైనవి-- కొనియాడవచ్చు.

కొంతమంది కంట్లో నలకవంటి వారు. ఒక యోగి అట్టివారినుండి ఎంతోకొంత నేర్చుకొంటాడు: సహనం, క్షమ, ఇష్టాయిష్టాలనుండి విముక్తి. వారు అడిగేది: "మీరులేకపోతే నేను సహనం ఎలా పొందగలను? నేను ఇతరులను క్షమించడాన్ని ఎలా నేర్చుకొంటాను?" 85

No comments:

Post a Comment

Ramana Maharshi Biopics

Ramana Maharshi Biopics Bhagavan Ramana Maharshi House where Maharshi was born Temples and Agrahara where Maharshi was fed by Muttukris...