Bhagavat Gita
7.24
జరామరణ మోక్షాయ మా మాశ్రిత్య యతంతి యే
{7.29}
తే బ్రహ్మ తత్విదుః కృత్స్న మధ్యాత్మ౦ కర్మచాఖిలమ్
ఎవరు నన్ను ఆశ్రయించి జనన మరణములను పోగొట్టు కొనుటకు యత్నించుచున్నారో వారు పరబ్రహ్మ స్వరూపమును, తమ ఆత్మను , సకల కర్మమును తెలిసికొనుచున్నారు
నేను ఒకరోజు బడినుంచి ఇంటికి వచ్చినప్పుడు నా అమ్మమ్మ ఎందుకు విచారంగా ఉన్నావని అడిగింది. "నేను ఒక దుర్వార్త విన్నాను. మా భూగోళ శాస్త్రం తరగతిలో సూర్యునితో పోలిస్తే మనము అల్పాతి అల్పం అని ఉపాధ్యాయుడు చెప్పేడు" అని అన్నాను. దానికి అమ్మమ్మ నవ్వి "సూర్యుడు ఎప్పుడో ఒకప్పుడు ఆరిపోతాడు. కానీ నువ్వు నేను ఎన్నటికీ ఉండేవారమే" అని అంది.
మనము పుట్టలేదు, మరణించబోము. మన ఆత్మ శ్రీకృష్ణుడు చెప్పినట్లు, ఒక పాత శరీరాన్ని వదిలి క్రొత్త శరీరాన్ని ధరిస్తుంది. కాబట్టి సూర్యుడు మనతో పోలిక పెడితే ఒక యుక్త వయస్కుడు. ఖగోళ శాస్త్రజ్ఞులు సూర్యుడు 500 కోట్ల సంవత్సారల క్రింద పుట్టేడని. భవిష్యత్తులో కొన్ని వందల కోట్ల సంవత్సరాల తరువాత సూర్యుని లోని హీలియమ్ అనబడే ఇంధనం అయిపోయి సూర్యుడు ఆరిపోతాడు. ఈ సృష్టిలో పుట్టినది గిట్టుతుంది. మరణించినది మరల పుడుతుంది. కానీ ఆత్మ ఎన్నటికీ ఉంటుంది. అది అన్నిటినీ చూసే సాక్షి.
ధ్యాన అభ్యాసము చివరి స్థితిని సమాధి అంటారు. అ స్థితిలో మనము చేతన మనస్సుకు అతీతమై, మన శరీరము అందరి మేలుకై ఇవ్వబడిన పని ముట్టని తెలిసికొ౦టాము. నెహ్రూ మహాత్మా గాంధీ గురించి ఇలా అన్నారు: "ఆయన ఎక్కడ కూర్చొంటే అక్కడ గుడి వెలుస్తున్నట్టే. ఆయన ఎక్కడ అడుగుపెడితే అది పుణ్యక్షేత్రం అయినట్టే". మనము కూడా ఇతరుల సంక్షేమానికై పాటుబడి మనవంతు కర్మ చెయ్య వచ్చు. బుద్ధుడు దీనినే బహుజనహితాయ, బహుజనసుఖాయ --అనగా అనేక మంది సంక్షేమానికై, అనేకమంది సుఖానికై -- అని చెప్పెను.