Bhagavat Gita
7.25
సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః
{7.30}
ప్రయాణకాలే అపి చ మాం విదు ర్యుక్తచేతసః
అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము నేనే అని ఎవరు గ్రహించుచున్నారో వారు మరణకాలము నందు కూడా మనస్సును నా యందుంచి నన్నెరుగుదురు ఀ
ఎవరైతే ఆధ్యాత్మిక జీవనం అవలంబించి, ధ్యానము చేయుదురో వారికి జగతియొక్క ఏకత్వము విదితమగును. చివరగా దేవుని అన్నిటియందు చూచెదరు: ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, జంతువులు, పక్షులు, మనుష్యులు వగైరా. దేవుని ఇట్లు చూడువానికి గాలి చెట్లను కదిలించు శబ్దము దేవుని గుసగుసలుగా తలచును; సముద్ర కెరటాలు చేయు శబ్దము మంత్ర జపముగా వినును. ప్రతీదీ శ్రీ కృష్ణుని మయ౦.
ఈ విధముగా చేతన మనస్సులో భగవంతుని ధ్యానించు వానికి మరణముయందుకూడా చేతనమును విడువడు. నా అమ్మమ్మ రోజూ ఉదయాన్నే శివుని గుడికి వెళ్ళి, ఒక పుష్పాన్ని తెచ్చి నా చెవి వెనక పెట్టి "నువ్వు మార్కా౦డేయుడవంటి భక్తుడివి అవ్వు" అని దీవించేది.
మార్కా౦డేయుని తలిదండ్రులు శివభక్తుడిని తమకు బిడ్డగా ఇవ్వవలసిందిగా ఘోర తపస్సు చేసేరు. దానికి ప్రతిఫలంగా మార్కా౦డేయుడు వాళ్ళకి బిడ్డగా కలిగేడు. కాని అతడు పదహారవ ఏట మరణిస్తాడు. వారు కోరినట్టే మార్కా౦డేయుడు గొప్ప శివ భక్తుడయ్యాడు.
వాని 16 వ జన్మ దినము నాడు తలిదండ్రులు యముడు వచ్చి అతనిని తీసికివెళ్తాడని చెప్పేరు. మార్కా౦డేయుడు శివునిని ధ్యానిస్తూ ఉండగా యమధర్మరాజు రానే వచ్చేడు. అంతలోనే శివుడు ప్రత్యక్షమై "నా పాదాల మీద పడి రక్షణ కోరేవారు నీ వసులు కాలేరు" అని చెప్పి మార్కా౦డేయుడిని తలపై తన అభయహస్తం ఉంచి "మార్కా౦డేయుడు నా శక్తి వలన జరామరణ వర్జితుడైనాడు" అని దీవించెను.