Bhagavat Gita
7.3
మనుష్యాణాం సహస్రేషు కశ్చి ద్యతతి సిద్ధయే
{7.3}
యతతా మపి సిద్ధానాం కశ్చి న్మాం వేత్తి తత్త్వతః
వేలమంది మనుష్యులలో ఏ ఒక్కడో సిద్ధి కొరకు ప్రయత్నించును. అలా యత్ని౦చెడి వేలమందిలో ఏ ఒక్కడో నన్ను యదార్థముగా తెలిసి కొనును
ఒకమారు నేను ఒక పుస్తకాల కొట్టు లో ధ్యానం గురించ చెప్పడానికి వెళ్ళేను. అక్కడ కొంత మంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళు నేను చెప్పిందంతా విన్నారు. చివర్లో నేను వాళ్ళతో కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దామని అన్నాను. కొంత సేపయ్యేక నేను కళ్ళు తెరిచి చూస్తే అక్కడ నేను, నా భార్య, పుస్తకాల కొట్టు యజమాని తప్ప ఇంకెవ్వరూ లేరు.
చాలా మంది యోగ లేదా ధ్యానం గురించి విన్నారు. కానీ వారికి సాధన చేయడానికి భయం.
ధ్యానం నిస్తేజంగా ఉంటుంది. దానికై చాలా శ్రమ పడాలి. నేను చాలా ఏళ్లు ధ్యానం చేసి తెలుసుకున్నదేమిటంటే దానికై కోరిక, నిబద్ధత ఉండాలి. నిజానికి దేనిలో రాణించాలన్నా అవి అవసరం. ఉదాహరణకి ఒక ఈతగాడు ఒలింపిక్స్ లో పతకం సంపాదించాలనే లక్ష్యం ఉంటే దానికై చాలా పరిశ్రమ చెయ్యాలి.
ఈ రోజుల్లో బహు తక్కువ మంది ఒక గొప్ప కార్యం చేస్తారు. ఎందరో కొందరు ఒక సామాన్యమైన కార్యాన్ని చేయడానికి ముందుకు వస్తారు. కానీ ఎంతోమంది జాప్యం చేస్తారు. గోడమీద పిల్లిలాగ ఎటు వెళ్ళాలో నిర్ధారించుకోరు. ఒక మంచి కార్యనికై చాలా ఉత్సాహం ఉండాలి. మన సినిమాలను, కళా ప్రదర్శనలను చూస్తే మనకు తెలిసేదేమిటంటే ఒక చక్కటి అంగీ చేయడానికి, లేదా ఒక మంచి వీణను చేయడానికి చాలా మంది కృషి చేసేరు. వారు ధ్యానంలోకి వస్తే ఎంతో ముందుకు సాగుతారు.
మనం ఎంత కృషి చేసినా, ధ్యానంలో కొన్ని అవరోధాలు వస్తాయి. మన ఇంద్రియాలు, అహంకారం తలెత్తుతాయి. అలాటప్పుడు ఒక గురువు అవసరం ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితం బహు దీర్ఘమైనది మరియు కష్టాలతో కూడినది. మన చేతన మనస్సు లోతులకు వెళ్ళడం ధ్యానంలో కొంత అనుభవం ఉంటే గానీ వీలవ్వదు. మనదగ్గర ఒక క్రొత్త ప్రదేశానికి సంబంధించిన పటం (map) లేకపోతే వేటిని సందర్శించకూడదో, తిరిగి ఎలా రావాలో తెలియదు. అలాగే ధ్యానంలో మెళుకువలు చెప్పి, కష్టాలను ఎలా అధిగమించాలో చెప్పడానికి ఒక గురువు అవసరం ఎంతో ఉంది.
ఒకమారు నేను నా భార్య కొండల మధ్యలోంచి వెళుతూ ఉంటే మా కార్ ఒక రాయి మీదకి ఎక్కి నిలిచిపోయింది. మేమెంత ప్రయత్నించినా కారు ముందుకు వెళ్లలేదు. ఆ దారిన పోతున్న కొందరు యువకులు మాకు సహాయం చేయడానికి వచ్చేరు. కానీ వాళ్ళ వలనా కాలేదు. చివరకు నేను టోవ్ ట్రక్ ని పిలిచేను. ఆ టోవ్ ట్రక్ తో ఐదు నిమిషాలలో కారు కదిలింది. ఒక మంచి గురువు టోవ ట్రక్ నడిపేవాడిలాగ మనని గమ్యానికి అతి తొందరలో తీసికెళ్లగలడు. 35
No comments:
Post a Comment